
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల(Uttarakhand Assembly Elections) ప్రచారం కోసం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Union Minister Rajnath Singh) గంగోలిహాట్‌లో తన ప్రసంగం ఇచ్చారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం పుష్కర్ సింగ్ ధామిని ప్రశంసల్లో ముంచెత్తారు. గంగోలిహాట్‌లో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. పుష్కర్ సింగ్ ధామి సాదాసీదా మనిషి అని, హుందాగా వ్యవహరించే మంచి మనిషి అని పొగిడారు. అదే సందర్భంలో ఆయన పుష్ప({Pushpa) సినిమానూ ప్రస్తావించారు.
‘ఈ రోజుల్లో ఒక సినిమా గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. అదే ఆ సినిమా పేరు పుష్ప. పుష్కర్ పేరు విని కూడా కాంగ్రెస్ మిత్రులు అదొక పుష్పం మాత్రమే అని భావిస్తున్నారు. కానీ, వారికి నేను ఒక విషయం తెలియజేస్తున్నాను. ఈ పుష్కర్ ధామి ఒక పుష్పమే కాదు.. ఫైర్ కూడా. పుష్కర్ ధామిని ఎక్కడ ఆగిపోడు. ఎవరి ముందూ తలవంచడు. ఎవరూ ఆయనను ఆపలేరు’ అని పేర్కొన్నారు.
‘కాంగ్రెస్‌కు అసలు ఒక నేతనే లేడని విమర్శించారు. ఒక నేత లేడు.. ఒక ఉద్దేశ్యం లేదు.. ఒక నినాదం లేదు. కాంగ్రెస్ కేవలం దేశాన్ని దోచుకున్నది. రాష్ట్రాన్ని కూడా దోచుకుంది. కానీ, ఇకపై ఈ రాష్ట్రాన్ని మరోసారి కాంగ్రెస్ దోచుకోనివ్వం. వారి వాగ్దానాలు పచ్చి అబద్ధాలు. ప్రతి హామీ అబద్ధమే’ అని కేంద్ర మంత్రి అన్నారు.
ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పని చేయనున్నారు. త్వరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ని అక్షయ్ కుమార్‌ను కలిశారు. రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం పుష్కర్ సింగ్ ధామి మాట్లాడారు. ‘‘ మేము అతనికి (అక్షయ్ కుమార్) ఒక ప్రతిపాదన ఇచ్చాము, అతను దానిని అంగీకరించాడు. అతను ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్ ఇక నుంచి పని చేస్తాడు ’’ అని ఆయన ఓ మీడియా సంస్థతో వివరాలు పంచుకున్నారు. సోమవారం ఉదయం డెహ్రాడూన్ లోని సీఎం నివాసంలో ఈ ఒప్పందం జరిగింది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 70 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ అధికార పార్టీగా ఉంది. ఈ సారి కూడా మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా విస్తృతంగా ప్రచారాన్ని చేస్తోంది. కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ రెజ్లర్ బబితా ఫోగట్ (rajlar bhabitha phogat) చేసిన వీడియోను ధామీ షేర్ చేశారు. ‘‘ భారతదేశ ప్రతిభావంతులైన క్రీడాకారిణి, యూత్ ఐకాన్ అయిన దంగల్ అమ్మాయి బబితా ఫోగట్ కు మా పట్ల (బీజేపీ ప్రభుత్వం) ఉన్న ఆప్యాయతకు ధన్యవాదాలు ’’ అని ఆయన ట్వీట్ చేశారు.