ట్రెక్కింగ్ చేస్తూ కొండెక్కి.. కాలు జారి రాళ్ల మధ్యలో చిక్కుకుని నరకం.. రెండు రోజులుగా రెస్క్యూ ప్రయత్నాలు

Published : Feb 08, 2022, 06:15 PM IST
ట్రెక్కింగ్ చేస్తూ కొండెక్కి.. కాలు జారి రాళ్ల మధ్యలో చిక్కుకుని నరకం.. రెండు రోజులుగా రెస్క్యూ ప్రయత్నాలు

సారాంశం

కేరళ పాలక్కడ్‌లోని ఓ ఎత్తైన కొండ ఎక్కడానికి సోమవారం మధ్యాహ్నం ముగ్గురు మిత్రులు ట్రెక్కింగ్ ప్రారంభించారు. సగం దూరం వెళ్లి ఇది సాధ్యం కాదనుకుని ఇద్దరు ట్రెక్కింగ్ విరమించుకున్నారు. కానీ, ఒకతను మాత్రం కొండ అంచు చేరుకున్నాడు. కానీ, దురదృష్టవశాత్తు కాలు జారి లోయ వంటి ప్రాంతం వైపు పడిపోయాడు. చివరకు ఆయన కొన్ని రాళ్ల మధ్యలో చిక్కుకున్నాడు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కూడా ఆయన రక్షించడం సాధ్యం కావడం లేదు. సహాయక చర్యలు రెండు రోజులుగా జరుగుతున్నాయి.  

తిరువనంతపురం: ముగ్గురు యువకులు సరదాగా ట్రెక్కింగ్ చేస్తూ కొండెక్కారు. దుర్భేద్యమైన ఆ కొండను ఎక్కడంలో సాధ్యం కాదని ఇద్దరు మిత్రులు వెనుదిరిగారు. కానీ, బాబు అనే యువకుడు పట్టు వదల్లేడు. పూర్తిగా ఎక్కాల్సిందేనని విశ్రమించలేదు. చివరకు విజయవంతంగా ఆయన ఆ కొండ పైభాగానికి చేరుకున్నాడు. కానీ, దుదృష్టవశాత్తు ఆయన కాలు జారి కిందికి జారిపోయాడు. పక్కనే లోయలా ఉన్న దానిలో పడిపోయాడు. చివరకు కొన్ని రాళ్ల మధ్య ఇరుక్కుని కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ ప్రాంతం ఎంత కఠినంగా ఉన్నదంటే.. సహాయక చర్యలు అందించడం కూడా సాధ్యం కావడం లేదు. నేవీకి చెందిన హెలికాప్టర్ రంగంలోకి దిగినా.. బాబును వెనక్కి తేవడం సాధ్యం కాలేదు. అయినప్పటికీ రెండు రోజులుగా ఆ యువకుడిని కాపాడటానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

కేరళ రాష్ట్రం పాలక్కడ్‌లోని నిటారుగా దుర్భేద్యంగా ఉన్న కురుంబాచి కొండను(చెరాడ్ కొండల్లో ఇది ఒకటి) ఎక్కడానికి సోమవారం మధ్యాహ్నం బాబు, మరో ఇద్దరు మిత్రులు సిద్ధం అయ్యారు. ఆ ముగ్గురు ట్రెక్కింగ్ ప్రారంభించారు. సగం దూరం వెళ్లాక బాబుతో వచ్చిన ఇద్దరు మిత్రులు ఆ కొండ ఎక్కలేకపోయారు. కానీ, బాబు మాత్రం తన ట్రెక్కింగ్ ఆపలేదు. చివరకు ఆయన కొండ టాప్‌కు వెళ్లాడు. కానీ, కొండ టాప్ నుంచి ఆయన జారిపోయాడు. లోయలాగా ఉన్న లోతైన భాగంలోకి పడి రాళ్ల మధ్యలో చిక్కుకున్నాడు. 

ఆయన ఆ రాళ్ల మధ్యలో చిక్కుకుని 24 గంటలు ఎప్పుడో దాటి పోయింది. ఇప్పటికీ అక్కడే ఉండిపోయాడు. ఆయన కాలుకు తీవ్ర గాయం అయింది. మరికొన్ని గాయాలూ అయ్యాయి. బాబు తన కాలి గాయమైన చిత్రాలను పంపించారు. రెస్కూ వర్కర్లు బాబును వెతుక్కుంటూ ఆయన దగ్గర వరకు వెళ్లగలిగారు. నిన్న ఆయన దగ్గర దాకా వెళ్లినా బాబు లోయ వంటి ప్రాంతంలో పడిపోవడంతో చేరలేకపోయారు. 

దీంతో నేవీకి చెందిన హెలికాప్టర్‌నూ రంగంలోకి దిగారు. కానీ, బాబును అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకురావడం సాధ్యం కాలేకపోయింది. హెలికాప్టర్ ద్వారా చేసిన రెస్క్యూ ప్రయత్నాలూ విఫలం అయ్యాయి. ఆహారం, నీటిని అందించడం కూడా సాధ్యం కాలేదు. ఇందుకు విపరీతంగా వీస్తున్న గాలులు కూడా ఒక కారణంగా ఉన్నది. ప్రస్తుతం ఎన్‌డీఆర్ఎఫ్ బృందం ఒకటి బాబు చిక్కుకున్న ప్రాంతానికి సమీపంలోనే క్యాంప్ వేసుకున్నారు. కాగా, సహాయక చర్యలను పాలక్కడ్ జిల్లా కలెక్టర్ సమన్వయం చేస్తన్నారు. బాబుకు వెంటనే ఆహారం, నీటిని అందించాలని అధికారులకు పాలక్కడ్ ఎమ్మెల్యే షఫీ పరంబిల్ సూచించారు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !