నేషనల్ సింగిల్ విండో సిస్టమ్‌లో చేరిన తొలి యూటీగా జమ్ము కశ్మీర్ రికార్డ్

Published : Feb 08, 2022, 07:15 PM ISTUpdated : Feb 08, 2022, 07:21 PM IST
నేషనల్ సింగిల్ విండో సిస్టమ్‌లో చేరిన తొలి యూటీగా జమ్ము కశ్మీర్ రికార్డ్

సారాంశం

జమ్ము కశ్మీర్ కీలక ముందడుగు వేసింది. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఉపయోగపడే సింగిల్ విండో సిస్టమ్‌ను ఇక్కడ ప్రారంభించారు. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్‌లో చేరిన తొలి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ము కశ్మీర్ నిలిచింది. ఈ నేషనల్ సింగిల్ విండో సిస్టమ్‌తో ఏకీకృతమైన జమ్ము కశ్మీర్ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సోమవారం ప్రారంభించారు.  

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్(Jammu Kashmir) సరికొత్త రికార్డు నెలకొల్పింది. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్‌(NSWS)లో చేరిన తొలి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ము కశ్మీర్ నిలిచింది. ఈ సింగిల్ విండో సిస్టమ్‌లో చేరడం ద్వారా ఇన్వెస్టర్లు(Investors) ఆకర్షించడం సులువు అవుతుంది. జమ్ము కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ సింగిల్ విండో ఎన్నో సౌలభ్యాలను కలిగిస్తుంది. అవసరమైన అనుమతులు, డాక్యుమెంట్లు, దరఖాస్తు పద్ధతులు వంటి వివరాలు అందించడమే కాదు.. వాటిని సింగిల్ విండో ద్వారానే పొందవచ్చు. తమ వ్యాపారానికి సరిగ్గా సరిపోయే భూమిని వెతికి పట్టుకోవడానికి కూడా ఈ సింగిల్ విండో ఉపకరిస్తుంది. కాబట్టి, ఈ సింగిల్ విండోలో జమ్ము కశ్మీర్  చేరడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ కీలక అడుగులు వేసినట్టయంది.

నేషనల్ సింగిల్ విండో సిస్టమ్‌తో ఏకీకృతమైన జమ్ము కశ్మీర్ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్‌ను జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నిన్న ప్రారంభించారు. జమ్ము కశ్మీర్ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ మెహెతా, డీపీఐఐటీ అదనపు కార్యదర్శి సుమిత డావ్రా, జమ్ము కశ్మీర్ ఇండస్ట్రీస్, కామర్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రంజన్ ఠాకూర్‌ల సమక్షంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ విధానాన్ని ప్రారంభించారు. 

నేషనల్ సింగిల్ విండో సిస్టమ్..  ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్‌తో లింక్ అయి ఉన్నది. ఈ ఐఐఎల్‌బీ జమ్ము కశ్మీర్‌లోని 45 ఇండస్ట్రియల్ పార్క్‌ల వివరాలను సమగ్రంగా కలిగి ఉన్నది. కాబట్టి, జమ్ము కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి భూమికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం ఇది ఎంతో ఉపయుక్తం కానుంది.

2020 కేంద్ర బడ్జట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ నేషనల్ సింగిల్ విండో సిస్టమ్‌ను ప్రకటించింది. ఇది ఇన్వెస్టర్లకు గైడ్‌గా పనికి వచ్చే ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా పనికి వస్తుంది. వారి వ్యాపారాలకు సరిగ్గా సరిపడే భూమిని వెతకడానికి, అందుకు అవసరమైన అనుమతుల వివరాలను కూడా ఈ ప్లాట్‌ఫామ్ అందిస్తుంది. 2021లో కేంద్ర కామర్స్ ఇండస్ట్రీ మినిస్టర్ పియూష్ గోయల్ ప్రారంభించారు.

అనేక ప్లాట్‌ఫామ్‌లు, ఆఫీసులను సందర్శించాల్సిన అవసరాలను ఈ ప్లాట్‌ఫామ్ తగ్గిస్తుంది. ఎంతో సమాచారాన్ని, క్లియరెన్స్‌లను ఇన్వెస్టర్లు ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా పొందవచ్చు. కార్పొరేట్ వ్యవహారాలు, పర్యావరణ, అటవీ, పర్యావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, కామర్స్, ఇండస్ట్రీ మినిస్ట్రీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు సహా సుమారు 20 మంత్రిత్వ శాఖలు ఈ నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ ప్లాట్‌ఫామ్‌లో ఏకీకృతమై ఉన్నాయి. 

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, జమ్ము కశ్మీర్, ఉత్తరాఖండ్‌లు సహా 14 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఈ ఏడాది తొలిసారి జమ్ము కశ్మీర్‌లో శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లోని భార‌త త్రివ‌ర్ణ ప‌తాకం రెప‌రెప‌లాడింది. 73వ గ‌ణ‌తంత్ర వేడుక‌ల సంద‌ర్భంగా స్థానిక క్లాక్ ట‌వ‌ర్ వ‌ద్ద ఇద్ద‌రు వ్య‌క్తులు సాజిద్ యూసుఫ్ షా, సాహిల్ బషీర్ భట్ లు జాతీయ జెండాను బుధ‌వారం ఆవిష్క‌రించారు. స్వాతంత్య్రానంతర భారతదేశంలో అనేక దశాబ్దాల తర్వాత శ్రీనగర్‌లోని ఘంటా ఘర్‌పై త్రివర్ణ పతాకం స‌గ‌ర్వంగా ఎగిరింది. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu