లోక్ సభలో రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్.. స్పీకర్‌కు మంత్రి స్మృతి ఇరానీ ఫిర్యాదు.. కాంగ్రెస్ ఏమన్నదంటే?

Published : Aug 10, 2023, 12:59 AM ISTUpdated : Aug 10, 2023, 01:00 AM IST
లోక్ సభలో రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్.. స్పీకర్‌కు మంత్రి స్మృతి ఇరానీ ఫిర్యాదు.. కాంగ్రెస్ ఏమన్నదంటే?

సారాంశం

రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రసంగించిన తర్వాత వెళ్లిపోతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడని, ఇది మహిళలను అగౌరవపరిచే చర్యేనని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. మరికొందరు మహిళా ఎంపీలు కలిసి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు.  

న్యూఢిల్లీ: ఈ రోజు లోక్ సభలో వాడి వేడిగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు సంధించారు. మణిపూర్‌ను మాత్రమే హత్య చేయలేదని, మణిపూర్‌లో భారత్‌ను హత్య చేసిందని ఫైర్ అయ్యారు. ఇప్పటికీ మణిపూర్‌కు వెళ్లని ప్రధాని మోడీకి మణిపూర్ మన దేశమే కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం, హోం మంత్రి అమిత్ షా ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడుతూ.. మణిపూర్ ఘటనలు దారుణమని, కానీ, వాటిని రాజకీయం చేయడం మరింత దారుణం అని ప్రతిపక్షం పై మండిపడ్డారు. ఇదంతా ఒక వైపు ఉండగా.. స్మృతి ఇరానీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ విమర్శల పర్వం, అమిత్ షాల సమాధానాల కంటే కూడా స్మృతి ఇరానీ చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి.

అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ మాట్లాడి లోక్ సభ నుంచి వెళ్లిపోతుండగా తాము కూర్చున్న వైపు చూపిస్తూ ఫ్లైయింగ్ కిస్ చేశాడని మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర ఆరోపణలు చేశారు. మరికొందరు మహిళా ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీపై స్పకీర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఇంతటి మహిళా వ్యతిరేక ప్రవర్తన పార్లమెంటులో ఎప్పడూ లేదని ఆమె రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. మహిళలు కూర్చున్న వైపు చూపిస్తూ ఫ్లయింగ్ కిస్ వదిలారని, మహిళల పట్ల ఆయనకు ఏం గౌరవం ఉన్నదో ఇది వెల్లడిస్తున్నదని ఫైర్ అయ్యారు. 

Also Read: Women wrestlers: లైంగిక ఉద్దేశం లేకుండా హగ్ చేసుకోవడం నేరం కాదు: కోర్టులో బ్రిజ్ భూషణ్

రాహుల్ గాంధీపై పలువురు మహిళా ఎంపీలు లోక్ సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసినట్టు కేంద్ర మంత్రి, బీజేపీ నేత శోభా కరంద్లాజే తెలిపారు.

కాగా, రాహుల్ గాంధీ ట్రెజరీ బెంచ్‌ల వైపు చూపుతూ ఫ్లయింగ్ కిస్ గెషర్ చేశారని కాంగ్రెస్‌కు చెందిన ఓ నేత తెలిపారు. అంతేకానీ, ఆయన మహిళా ఎంపీల వైపో, మరీ ముఖ్యంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వైపో చూసి ఫ్లయింగ్ కిస్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?