రాహుల్ గాంధీపై అనురాగ్ ఠాకూర్ ఘాటు విమర్శలు.. ఇంతకీ ఏం జరిగిందంటే.? 

By Rajesh KarampooriFirst Published Jun 5, 2023, 12:37 AM IST
Highlights

ఒడిశా రైలు ప్రమాదంపై నైతిక బాధ్యత వహిస్తూ.. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజా కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  రాజీనామా డిమాండ్‌పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీపై దాడి చేశారు.

రాహుల్ గాంధీపై అనురాగ్ ఠాకూర్ ఫైర్: ఒడిశా రైలు ప్రమాదంలో ప్రభుత్వ బాధ్యతను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారనీ, కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ , ఇతర మంత్రులు పూర్తి అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. రైల్వే మంత్రి కూడా ప్రమాద స్థలికి వెళ్లారు, ప్రధాని కూడా అక్కడికి వెళ్లారు. కేంద్రంలోని అగ్ర నేతలంతా సంఘటన స్థలాన్ని సందర్శించి, బాధితులను పరమర్శించారు. అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు వేగవంతం చేశారని తెలిపారు.

అదే సమయంలో రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తూ.. మీరు (రాహుల్ గాంధీ) చైనా అధికారులతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని. దానికి ఇప్పటి వరకు మీరు సమాధానం చెప్పలేదని అన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చైనా నుండి ఎన్ని డాలర్లు వచ్చాయో రాహుల్ గాంధీ ఎప్పుడూ సమాధానం ఇవ్వలేదనీ, అమెరికాలో మీ ఈవెంట్‌లను ఎవరు నిర్వహిస్తున్నారని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. 

ఇంతకీ రాహుల్ గాంధీ ఏమన్నారు ?

ఒడిశా రైలు ప్రమాదానికి మోదీ ప్రభుత్వం బాధ్యత వహించకుండా పారిపోదని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అంతకుముందు ఆరోపించారు.270 మందికి పైగా మరణించినా జవాబుదారీతనం లేదనీ,  ఇలాంటి బాధాకరమైన ప్రమాదానికి బాధ్యత వహించకుండా మోదీ ప్రభుత్వం పారిపోదనీ, తక్షణమే ప్రధాని, రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  

ప్రమాదంపై సీబీఐ విచారణ

ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు ఆదివారం సిఫారసు చేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 275 మంది మరణించగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. "రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కాగా.. ట్రాక్‌ పునరద్దరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఓవర్ హెడ్ వైరింగ్ పనులు జరుగుతున్నాయనీ, గాయపడిన ప్రయాణికులు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

click me!