ప్రజాప్రతినిధులపై కేసులు: జిల్లాకో ప్రత్యేక కోర్టు.. కేంద్రం సుముఖత

By Siva KodatiFirst Published Sep 16, 2020, 5:25 PM IST
Highlights

ప్రజా ప్రతినిధుల నేరారోపణ కేసులపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ ట్రయల్‌పై కేంద్రం సుముఖుత వ్యక్తం చేసింది. ఈ కేసులో విచారణకు కాల వ్యవధిని సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది

ప్రజా ప్రతినిధుల నేరారోపణ కేసులపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ ట్రయల్‌పై కేంద్రం సుముఖుత వ్యక్తం చేసింది. ఈ కేసులో విచారణకు కాల వ్యవధిని సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది.

తాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నేరారోపణ కేసులకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ విచారణ కోసం ఈ ట్రయల్స్ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు  సొలిసీటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ప్రజాప్రతినిధులపై వున్న కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలన్ని  పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టింది.

ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానానికి సహకరించేందుకు నియమించిన అమీకస్ క్యూరీ అన్సారీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీలకు సంబంధించి 4,400కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఇది వరకే నివేదిక సమర్పించారు.

తాజాగా మరో సప్లిమెంటరీ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేశారు. ప్రజాప్రతినిధులపై వున్న కేసుల సత్వర విచారణకు ఎలాంటి సూచనలు చేస్తారని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కోరగా.. సత్వర విచారణ కోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అమీకస్ క్యూరీ సూచించారు.

దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు అత్యున్నత ధర్మసనానికి విన్నవించారు. 

click me!