కరోనా : ఈ మూడూ పాటించండి.. సీఎంలకు అమిత్ షా టార్గెట్

By Siva KodatiFirst Published Nov 24, 2020, 2:59 PM IST
Highlights

దేశంలో తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా వైరస్ ఢిల్లీ సహా కొన్ని ప్రాంతాల్లో తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ క్రమంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు

దేశంలో తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా వైరస్ ఢిల్లీ సహా కొన్ని ప్రాంతాల్లో తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ క్రమంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి హాజరైన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ముఖ్యమంత్రుల ముందు 3 పాయింట్లతో కూడిన టార్గెట్‌ను ఉంచారు. కరోనా మృతుల సంఖ్య 1 శాతానికి కంటే తక్కువగా ఉండేలా, రిస్క్ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉండేలా చూడాలని సూచించారు.

అలాగే కంటైన్ మెంట్ జోన్ వ్యూహానికి కొత్త రూపు ఇవ్వాలని కోరారు. అధికారులు తప్పనిసరిగా ప్రతివారం రెడ్ జోన్లలో పర్యటించాలని, వారు సేకరించిన సమాచారం అనుగుణంగా ఆయా ప్రాంతాల స్టేటస్‌లో మార్పులు చేయాలని అన్నారు.

ఇక సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాలను తగులబెడుతుండటం వల్ల దేశ రాజధానిలో కోవిడ్-19 థర్డ్ వేవ్ తీవ్రతకు ప్రధాన కారణమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.

తాను ఎప్పటికప్పుడు భారత్‌లో టీకా అభివృద్ధిలో క్రియాశీలకంగా వున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అదర్ పూనంవాలాతో సంప్రదిస్తున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వివరించారు.

వాక్సిన్ సకాలంలో పంపిణీ చేసేందుకు, వ్యాక్సినేషన్ ప్రోగ్రాం సజావుగా సాగేందుకు తమ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన మోడీ దృష్టికి తెచ్చారు.

కాగా, ఈ వర్చువల్ మీటింగ్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ తదితరులు పాల్గొన్నారు.

click me!