కూతురు శరీరంతో తండ్రి వ్యాపారం.. మృగంలా పోలీసు అధికారి..!

Published : Nov 24, 2020, 02:07 PM IST
కూతురు శరీరంతో తండ్రి వ్యాపారం.. మృగంలా పోలీసు అధికారి..!

సారాంశం

అయినవారు పెడుతున్న బాధలే తట్టుకోలేక అల్లాడుతున్న ఆ బాలికపై ఓ పోలీసు అధికారి  కన్నుపడింది. అతను కూడా బాలిక పట్ల దారుణంగా ప్రవర్తించాడు.

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రి, కుటుంబసభ్యులే ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించారు. కూతురు శరీరంతో వ్యాపారం చేసి.. ఆ వచ్చిన డబ్బుతో వాళ్లు జల్సా చేసుకోవడం మొదలుపెట్టారు. అయినవారు పెడుతున్న బాధలే తట్టుకోలేక అల్లాడుతున్న ఆ బాలికపై ఓ పోలీసు అధికారి  కన్నుపడింది. అతను కూడా బాలిక పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వాషర్‌మెన్‌పేటకి చెందిన బాలిక(13) అయినవాళ్ల చేతిలో మోసపోయింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే సంతలో పశువులా అమ్మేశారు. ఆమె తనువుతో వ్యాపారం చేశారు. బలవంతంగా వ్యభిచారంలోకి దించి నరకం చూపించారు. ఆటలాడుకోవాల్సి వయస్సులో వరుస అత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం చేయాల్సిన పోలీసు అధికారే ఆమెపై కన్నేశాడు. పదమూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనపై చెన్నై పోలీస్ కమిషనర్‌ సీరియస్‌గా స్పందించారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్‌స్పెక్టర్ పుగజ్జెంతిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఇన్‌స్పెక్టర్ సహా ఎనిమింది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె పేరెంట్స్.. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన మరో ఐదుగురిని కూడా అరెస్టు చేసి కటకటాలవెనక్కి నెట్టారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
 

PREV
click me!

Recommended Stories

Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu
JIO : తక్కువ ధరకే 200 జీబీ డేటా.. జియో అద్భుత రీచార్జ్ ప్లాన్