ద్వేషంతో సమాజం చీలిపోతోంది: కేంద్రంపై కాంగ్రెస్‌ చీఫ్‌ విమర్శలు

By Rajesh KarampooriFirst Published Dec 29, 2022, 12:59 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. పేదలు, అణగారిన వర్గాలకు విముక్తి కల్పించే ధైర్యాన్ని కాంగ్రెస్ ప్రదర్శించడం వల్లే భారతదేశం పురోగమిస్తోందని పేర్కొన్నారు

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విరుచుకపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. భారతదేశంలోని ప్రాథమిక విలువలపై నిరంతరం దాడి జరుగుతోందని, సమాజం ద్వేషంతో విభజింపబడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు.   పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)లో తన పార్టీ సహచరులను ఉద్దేశించి ఖర్గే మాట్లాడుతూ ధరల పెరుగుదల, నిరుద్యోగంతో దేశ ప్రజలు అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

భారతదేశం స్వాతంత్ర్యం పొందిన సమయంలో అనేక ఇతర దేశాలు స్వాతంత్ర్యం పొందాయని, కొన్ని దశాబ్దాలలో మనం మాత్రమే విజయవంతమైన, బలమైన ప్రజాస్వామ్యంగా ఆవిర్భవించామని అన్నారు. ఆర్థిక, అణు , వ్యూహాత్మక రంగాలు, వ్యవసాయం, విద్య, వైద్యం, రంగాలలో భారత్ సూపర్ పవర్‌గా మారామని కాంగ్రెస్ చీఫ్ అన్నారు.  గత 75 ఏళ్లలో దేశ ప్రగతిలో ప్రతి ముఖ్యమైన మైలురాయిలో కాంగ్రెస్ పార్టీ తన ముద్ర ఉందని అన్నారు. పేదలు, అణగారిన, దళితుల వేల ఏళ్ల బంధాల నుంచి విముక్తి కల్పించేందుకు కాంగ్రెస్‌ ధైర్యాన్ని ప్రదర్శించడం వల్లే భారతదేశం పురోగమిస్తోందన్నారు.

అలాగే.. ఉచిత రేషన్ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఆహార భద్రత చట్టం కాంగ్రెస్‌ వరం అని మల్లికార్జున్‌ ఖర్గే ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ ఇస్తామని చెప్పిన మోదీ.. ఆహార భద్రత చట్టం కింద ఇస్తున్నారని, అది కాంగ్రెస్‌ వరం.. ఉచిత రేషన్‌ ఇస్తామని మాట్లాడుతున్నారని కేంద్రంపై మండిపడ్డారు. ఉచిత రేషన్‌ ను డిసెంబర్ 2023 వరకు పొడిగించారు. వారు దీనిని మే ఎన్నికల వరకు పొడిగిస్తారు." అని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబయిలో జరిగిన కార్యక్రమానికి మల్లికార్జున్ ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, మాజీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో సహా సీనియర్ నేతల సమక్షంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. 1885లో పార్టీని స్థాపించినందున వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబయిలో జరిగిన కార్యక్రమానికి శ్రీ ఖర్గే కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. "ప్రతి సందర్భంలోనూ సత్యం, అహింస , పోరాట మార్గాన్ని ఎంచుకుని, ప్రజా ప్రయోజనాల కోసం ప్రతి అడుగు వేసే అటువంటి సంస్థలో నేను భాగమైనందుకు నేను గర్వపడుతున్నాను" అని పేర్కొన్నారు.  

ఖర్గేకు కష్టాలు 

మరోవైపు కాంగ్రెస్‌ నేత ఖర్గేకు కష్టాలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని కలబురగిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు భూ అక్రమాస్తుల కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుమారుడు ప్రియాంక ఖర్గేలపై రాష్ట్ర లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. కర్ణాటకలోని కలబురగి జిల్లాలో 36 వేల చదరపు అడుగుల స్థలాన్ని కళ్యాణ మండపం నిర్మించేందుకు అంబేద్కర్ స్మారక్ సమితికి ఇచ్చి దుర్వినియోగం చేస్తున్నారని మణికాంత్ రాథోడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ భూమిని 1981లో కలబురగి పాలకవర్గం ప్రజల ఉపయోగం కోసం ఇచ్చింది. స్థానిక బీజేపీ నాయకుడు రాథోడ్‌ లోకాయుక్తకు చేసిన ఫిర్యాదు మేరకు గత కొన్నేళ్లుగా కళ్యాణ మండపాన్ని ప్రజలకు ఇవ్వకపోవడంతో సంబంధిత స్థలంలో పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ కార్యాలయాన్ని నిర్మించారు. .

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అంబేద్కర్ స్మారక కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు, అయితే, అతను ప్రస్తుతం ఆ సంస్థలో ఎటువంటి పదవిని కలిగి లేదు. కలబురగి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే కమిటీలో సభ్యుడిగా ఉన్నారని ఫిర్యాదుదారు తెలిపారు. నిందితులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, సంబంధిత భూమిలో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు అనుమతించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

click me!