కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అమిత్ షా అక్క రాజేశ్వరీ ప్రదీప్ షా సోమవారం ముంబయిలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అమిత్ షా అక్క రాజేశ్వరీ ప్రదీప్ షా (65) సోమవారం మరణించారు. ముంబయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు.
రాజేశ్వరీబెన్‌కు లంగ్ ట్రాన్స్‌ఫర్ ఆపరేషన్ చేశారు. అహ్మదాబాద్‌లో ఈ సర్జరీ జరిగింది. అక్కడ ఆమె పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఆమెను ముంబయి హాస్పిటల్‌కు తరలించారు. ఈ చికిత్స పొందుతూనే అమిత్ షా సోదరి రాజేశ్వరీ ప్రదీప్ షా ముంబయి హాస్పిటల్‌లో మరణించారు.
గతవారం అమిత్ షా దక్షిణ ముంబయిలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కను పరామర్శించి వచ్చారు. పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేలు కూడా ఆమె ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు.
Also Read : Viral: గర్ల్ ఫ్రెండ్ కోసం అమ్మాయి వేషంలో పరీక్ష రాయడానికి వెళ్లి.. ‘అరరే.. అంతా సరిగానే మేనేజ్ చేశానే..’
రాజేశ్వరీ మరణం తర్వాత అమిత్ షా తన ప్రజా కార్యక్రమాలు అన్నింటిని రద్దు చేసుకున్నారు. అహ్మదాబాద్‌లోనే ఆమె భౌతిక దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే, ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా అందలేవు.
పలు కార్యక్రమాల్లో హాజరు కావడానికి అమిత్ షా రెండు మూడు రోజులుగా అహ్మదాబాద్‌లోనే ఉన్నారు. మకర సంక్రాంతి కోసమూ ఆయన అహ్మదాబాద్‌లోనే గడపాలని అనుకున్నారు. ఇంతలోనే ఈ విషాద వార్త ఎదురైంది. ఆమె మరణానికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.