
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికి అందించాలనే ఉద్దేశ్యంతో అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు.ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం-జన్ మన్), ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (పీఎంఏవై-జీ) కింద లక్ష మంది లబద్దిదారులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొలి విడతగా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా దేశంలోని పలు జిల్లాలోని గిరిజనులతో మోడీ వర్చువల్ గా ప్రసంగించారు. తొలి విడతలో రూ. 540 కోట్లను మోడీ విడుదల చేశారు.ఈ సందర్భంగా మోడీ ప్రసంగించారు. వంట గ్యాస్, విద్యుత్,సురక్షిత మంచినీరు, హౌసింగ్ పథకాలను వినియోగించుకున్న తర్వాత గిరిజనుల్లో వచ్చిన మార్పుల గురించి మోడీ గుర్తు చేశారు. పదేళ్లుగా తమ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకు వచ్చిన విషయాన్ని మోడీ ప్రస్తావించారు.
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ పీటీజీ గురుకుల పాఠశాలలో చెంచులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, కలెక్టర్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గత ఏడాది నవంబర్ 15న జన జాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా గిరిజన సమూహాల సామాజిక ఆర్ధిక సంక్షేమం కోసం పీఎం జన్ మన్ కార్యక్రమాన్ని చేపట్టారు. రూ. 24 వేల కోట్ల బడ్జెట్ తో పీఎం జన్ మన్ కార్యక్రమాన్ని చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. తొమ్మిది మంత్రిత్వ శాఖల ద్వారా 11 అంశాలపై ఫోకస్ చేస్తుంది.అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న గిరిజనులకు హౌసింగ్, విద్యుత్, సురక్షిత మంచినీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంపై కేంద్రీకరించనున్నారు.