ఎన్ఎస్‌జీ కమాండోలు, జడ్ ప్లస్ సెక్యూరిటీ వద్దన్న అమిత్ షా

By Siva KodatiFirst Published Sep 17, 2019, 3:23 PM IST
Highlights

ఉగ్రవాద సంస్ధల నుంచి ప్రధాని మోడీ తర్వాత ముప్పు పొంచి వున్న రెండో వ్యక్తి అమిత్ షానే కావడంతో ఆయనకు ఎన్ఎస్‌జీ భద్రతను కేటాయించాలని కమిటీ నిర్ణయించింది. దీనిపై కమిటీ సభ్యులు అమిత్ షాను సంప్రదించగా.. తనకు సీఆర్‌పీఎఫ్ భద్రత చాలని తేల్చిచెప్పినట్లుగా హోంశాఖ వర్గాల సమాచారం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు ఎన్ఎస్‌జీ కమాండోల ద్వారా ఇచ్చే భద్రతను తిరస్కరించారు. కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన భద్రతపై వీఐపీ సెక్యూరిటీ అసెస్‌మెంట్ కమిటీ సమావేశమైంది.

ఉగ్రవాద సంస్ధల నుంచి ప్రధాని మోడీ తర్వాత ముప్పు పొంచి వున్న రెండో వ్యక్తి అమిత్ షానే కావడంతో ఆయనకు ఎన్ఎస్‌జీ భద్రతను కేటాయించాలని కమిటీ నిర్ణయించింది.

దీనిపై కమిటీ సభ్యులు అమిత్ షాను సంప్రదించగా.. తనకు సీఆర్‌పీఎఫ్ భద్రత చాలని తేల్చిచెప్పినట్లుగా హోంశాఖ వర్గాల సమాచారం. ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ భద్రత కింద అమిత్ షాకు 100 మంది కమాండోలు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు.

దీనితో పాటు కేంద్ర హోంమంత్రి హోదాలో ఉండటంతో ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద 50 మంది ఢిల్లీ పోలీసులు ప్రతిరోజు బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకు మందు హోంమంత్రిగా పనిచేసిన రాజ్‌నాథ్‌సింగ్‌కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కింద ఎన్ఎస్‌జీ కమాండోలు రక్షణ కల్పించేవారు. 
 

click me!