
గాంధీనగర్: హైద్రాబాద్ ను ఆనాడు భారత్‌లో విలీనం చేసిన ఘనత సర్ధార్ వల్లభాయ్‌పటేల్‌దేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు
గుజరాత్ రాష్ట్రంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు పాల్గొన్నారు.అభివృద్ధిలో ప్రస్తుతం హైద్రాబాద్ దేశానికి మార్గదర్శకంగా ఉందని ఆయన చెప్పారు.
పటేల్ స్పూర్తితోనే కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను రద్దు చేసినట్టుగా మోడీ గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ లు అభివృద్ధి చెందుతాయని మోడీ ధీమాను వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో మరో 19 లక్షల హెక్టార్ల ఎకరాలకు నీరు ఇచ్చేందుకు బిందు సేద్యంపై కేంద్రీకరిస్తున్న విషయాన్ని మోడీ ప్రకటించారు.తెలంగాణ విమోచన దినోత్సవం రోజునే ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.