భారత్‌లో నెమ్మదిస్తున్న కరోనా.. 13 రాష్ట్రాల్లో వెయ్యికంటే తక్కువ కేసులే: లవ్ అగర్వాల్

By Siva KodatiFirst Published May 27, 2021, 4:47 PM IST
Highlights

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపింది కేంద్రం ప్రభుత్వం. అయితే మరణాల రేటు మాత్రం ఆందోళనకరంగానే వుందని వెల్లడించింది. 

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపింది కేంద్రం ప్రభుత్వం. అయితే మరణాల రేటు మాత్రం ఆందోళనకరంగానే వుందని వెల్లడించింది. గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ... గడిచిన 20 రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయని తెలిపారు. 13 రాష్ట్రాల్లో రోజుకు వెయ్యి కంటే తక్కువ కేసులు నమోదవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 90 శాతానికి పెరిగిందని లవ్ అగర్వాల్ చెప్పారు. దేశవ్యాప్తంగా 20.26 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని వెల్లడించారు. 

కాగా, భారత్‌లో గత 24 గంటల్లో  2,11,299  కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం నాడు 21,57,857 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 2,11,299 మందికి కరోనా సోకిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. సుమారు 40 రోజుల తర్వాత  మే 24వ తర్వాత రోజువారీ కేసులు 1,96,427 నమోదయ్యాయి.  అయితే  గత రెండు రోజులుగా కరోనా కేసులు రెండు లక్షలపైనే నమోదౌతున్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.లాక్‌డౌన్ నేపథ్యంలో మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.

Also Read:యాంటీబాడీ కాక్ టెయిల్ తొలి డోసు వేసుకున్న 82 యేళ్ల వృద్ధుడు.. డిశ్చార్జ్ అయి ఇంటికి...

ఢిల్లీలో కూడ కరోనా  కేసులు తగుతున్నాయి. గత 24 గంటల్లో  దేశంలోని తమిళనాడులో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. 33,764 రికార్డయ్యాయి. తమిళనాడు తర్వాతి స్థానంలో కేరళ నిలిచింది. మహరాష్ట్రలో 24,752 కేసులు రికార్డయ్యాయి. కర్ణాటకలో 26,811, ఏపీలో 18,286 కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల వ్యవధిలో దేశంలో 3,847 మంది కరోనాతో చనిపోయారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,15,235కి చేరుకొంది. 

click me!