
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రతిరోజూ చేస్తున్న కరోనా టెస్టుల సంఖ్య పెరిగిందన్నారు.
దేశంలో ఇంకా 31 లక్షల యాక్టీవ్ కేసులు వున్నాయని.. ఐదు రాష్ట్రాల్లోనే 50 శాతం కరోనా మరణాలు నమోదవుతున్నాయని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ డోసులు వేస్ట్ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు. ఒక్క వ్యాక్సిన్ నిరుపయోగమైనా ఒక ప్రాణం రిస్క్‌లో పడుతుందని లవ్ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఇండియాలో గత 24 గంటల్లో 2,76,110 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,57,72,440కి చేరుకొంది. కరోనా నుండి కోలుకొన్న వారి సంఖ్య 2,23,55,440 కి చేరుకొందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ డేటా తెలిపింది. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు 9 వేలు పెరిగాయి.
Also Read:బ్లాక్ ఫంగస్ ను ఎలా గుర్తించాలి? ఏం చేయాలి?..ఎయిమ్స్ మార్గదర్శకాలివే...
వరుసగా నాలుగో రోజు మూడు లక్షలలోపుగా కరోనా కేసులు రికార్డయ్యాయి.కరోనాతో గత 24 గంటల్లో దేశంలో 3,874 మంది మరణించారు.దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,87,122కి చేరుకొంది. దేశంలో 86.23 శాతంగా రికవరీ రేటు నమోదైంది. కరోనా పరీక్షను ఇంట్లో నిర్వహించేందుకు కేంద్రం బుధవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ విషయమై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా సోకిన వ్యక్తుల ప్రైమరీ కాంటాక్టు పొందినవారితో పాటు కుటుంబసభ్యులు ఇంట్లో పరీక్షను ఉపయోగించుకోవచ్చని ఐసీఎంఆర్ తెలిపింది.
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య కల్గించింది. అయితే అందుకు భిన్నంగా బుధవారం నాడు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4 వేల లోపుగా నమోదైంది. లాక్‌డౌన్ కారణంగా చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టుగా ఆరోగ్యశాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి.