దేశంలో 29 కరోనా కేసులు, యుద్దప్రాతిపదికన చర్యలు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

Published : Mar 05, 2020, 11:33 AM ISTUpdated : Mar 05, 2020, 04:53 PM IST
దేశంలో 29 కరోనా కేసులు, యుద్దప్రాతిపదికన చర్యలు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

సారాంశం

దేశంలో ఇప్పటివరకు 29 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయన్నారు. 


న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు 29 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయన్నారు. 

 గురువారం నాడు రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్  కరోనా వ్యాధిపై రాజ్యసభలో ప్రకటన చేశారు.  ఇటలీ,చైనా, జపాన్ దేశాల్లో భారతీయులు పర్యటించకూడదని  కేంద్ర మంత్రి సూచించారు. కరోనా వైరస్ వ్యాధి పాజిటివ్ వచ్చిన  ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. 

Also read:కరోనాతో ఐటీ కంపెనీల్లో వర్క్‌ఫ్రం హోం హడావిడి: ఈటల సంచలన వ్యాఖ్యలు

ఈ వ్యాధి సోకిన వారు కేరళలో ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయినట్టుగా మంత్రి రాజ్యసభకు తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకొంటున్నామని  ఆయన వివరించారు.

ఈ వ్యాధి విషయమై అన్ని రాష్ట్రాలను  అప్రమత్తం చేశామని  మంత్రి ప్రకటించారు. జపాన్, దక్షిణ కొరియా దేశాలకు వీసాలను రద్దు చేసినట్టు మంత్రి ప్రకటించారు. ఓడ రేవుల నుండి ఇండియాకు తిరిగి వచ్చిన వారికి పరీక్షలు తప్పనిసరి చేశామన్నారు మంత్రి. అంతేకాదు అన్ని విమానాశ్రయాల్లో కూడ పరీక్షలు నిర్వహిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !