కేసీఆర్ బాటలోనే: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణలక్ష్మి పథకం

By narsimha lodeFirst Published Feb 1, 2021, 12:29 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న తరహలోనే మరో పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. గతంలో కూడ ఇదే తరహాలో రైతులకు పెట్టుబడి పథకాన్ని కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న తరహలోనే మరో పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. గతంలో కూడ ఇదే తరహాలో రైతులకు పెట్టుబడి పథకాన్ని కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

also read:కేంద్ర బడ్జెట్ 2020-21: వైద్య రంగానికి పెద్దపీట, కరోనా వ్యాక్సిన్ కు రూ. 35 వేల కోట్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని పథకాలను కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న పథకాల నమూనాలోనే ఈ తరహా పథకాలు ఉంటున్నాయి.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ లక్ష్మి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ  ప్రభుత్వం తరహలోనే ఈ పథకం ఉండనుంది.పేద కుటుంబాలకు చెందిన వారి పిల్లల వివాహాలకు  ఆర్ధిక సహాయం అందించే అవకాశం ఉంది. ఈ పథకం గైడ్‌లైన్స్ ను కేంద్రం త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

 


 

click me!