కుక్కిన పేనులా: తెల్లజెండాలు చూపుతూ సైనికుల శవాల్ని తీసుకెళ్లిన పాక్

By Siva KodatiFirst Published Sep 14, 2019, 2:51 PM IST
Highlights

మన సైనికుల కాల్పుల్లో పాకిస్తాన్‌కు చెందిన గులామ్ రసూల్ అనే జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. అయినప్పటికీ మన జవాన్లపై కాల్పులు జరుపుతూనే.. మరోపక్క మరణించిన సైనికుడిని తీసుకెళ్లేందుకు పాక్ సైనికులు ప్రయత్నించారు. ఈ క్రమంలో మరో సైనికుడిని దాయాది దేశం కోల్పోయింది

పాకిస్తాన్ సైన్యం తన సైనికుల శవాలను తీసుకెళ్లడానికి తెల్లజెండాలు ఉపయోగించింది. ఈ నెల 10-11 తేదీల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని హాజీపూర్ సెక్టార్ వద్ద పాకిస్తాన్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత శిబిరాలపై కాల్పులకు పాల్పడ్డారు.

అయితే ఇండియన్ ఆర్మీ వారికి ధీటుగా బదులిచ్చింది. మన సైనికుల కాల్పుల్లో పాకిస్తాన్‌కు చెందిన గులామ్ రసూల్ అనే జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. అయినప్పటికీ మన జవాన్లపై కాల్పులు జరుపుతూనే.. మరోపక్క మరణించిన సైనికుడిని తీసుకెళ్లేందుకు పాక్ సైనికులు ప్రయత్నించారు.

ఈ క్రమంలో మరో సైనికుడిని దాయాది దేశం కోల్పోయింది. దీంతో చేసేది లేక పాకిస్తాన్ తోక ముడిచింది. శుక్రవారం కాల్పుల ఉల్లంఘనను విరమించి తెల్లజెండాలు చూపుతూ.. మృతదేహాలను తీసుకెళ్లారు.

ఇందుకు భారత్ సైతం అప్పగించింది. గతంలో పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీంకు చెందిన సైనికులు భారత్ భూభాగంలోకి చొరబడేందుకు యత్నించడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ క్రమంలో వారి శవాలను తీసుకెళ్లేందుకు తెల్లజెండాలతో రావాలని భారత్ కోరినప్పటికీ.. పాకిస్తాన్ పెడచెవిన పెట్టింది. అంతేకాకుండా మరణించిన వారు తమ సైనికులు కాదంటూ బుకాయించింది. 

click me!