russia ukraine crisis: రేపు కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. భారతీయుల తరలింపుపై చర్చించే అవకాశం

Siva Kodati |  
Published : Feb 25, 2022, 04:30 PM IST
russia ukraine crisis: రేపు కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. భారతీయుల తరలింపుపై చర్చించే అవకాశం

సారాంశం

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో రేపు కేంద్ర కేబినెట్ (union cabinet) కీలక సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఉక్రెయిన్ సంక్షోభం, విద్యార్ధుల తరలింపుపై చర్చించనున్నారు. 

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో రేపు కేంద్ర కేబినెట్ (union cabinet) కీలక సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఉక్రెయిన్ సంక్షోభం, విద్యార్ధుల తరలింపుపై చర్చించనున్నారు. అంతకుముందు ఉక్రెయిన్ (Ukraine) లో గురువారం ఉదయం మొదలైన హింసాత్మక ఘటనలను తక్షణమే ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీ (pm modi) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ (vladimir putin)ను కోరారు. ఈ మేర‌కు ప్ర‌ధాని మోడీ పుతిన్ కు గురువారం రాత్రి స‌మ‌యంలో ఫోన్ కాల్ చేశారు. ఉక్రెయిన్ లో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో భార‌త్ సాయం చేయాల‌ని ఆ దేశం విజ్ఞ‌ప్తి చేసిన కొన్ని గంట‌ల త‌రువాత ఈ ప‌రిణామం చోటు చేసుకుంది. 

ఉక్రెయిన్, ర‌ష్యా మ‌ధ్య దౌత్యపరమైన చర్చలు, సంభాషణల కోసం అన్ని వైపుల నుంచి సమిష్టి కృషి అస‌వ‌రం అని మోడీ పిలుపునిచ్చారని ప్రధాన మంత్రి కార్యాలయం (pmo) ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ‘‘రష్యా, NATO సమూహం మధ్య నెలకొన్న విభేదాలు నిజాయితీతో కూడిన సంభాషణ ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలను ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి వివరించారు.

ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులు, ముఖ్యంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి భారతదేశ ఆందోళనలపై కూడా ప్రధాని మోడీ పుతిన్ తో చర్చించారు. అక్క‌డి స్టూడెంట్లు తిరిగి ఇండియాకు రావ‌డ‌నికి త‌మ దేశం అత్యంత ప్ర‌ధాన్య‌త ఇస్తోంద‌ని తెలిపారు. సమయోచిత ఆసక్తి ఉన్న అంశాలపై తమ అధికారులు, దౌత్య బృందాలు క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతూనే ఉంటాయని ఇరువురు నేతలు అంగీకరించారని PMO ఒక ప్రకటనలో తెలిపింది. 

మరోవైపు.. ఈ  సమయంలో ఉక్రెయిన్‌ను రాజకీయ, వైద్య పరంగా ఆదుకోవాలని ఉక్రెయిన్ ఎంపీ సోఫియా ఫెడీనా భారత దేశాన్ని కోరారు. ఉక్రెయిన్‌లోని ఓ బాంబు షెల్టర్‌లో ఉన్న సోఫియా ఫెడీనా  ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సార్వభౌమాధికార దేశం యొక్క మానవ హక్కులను కాపాడాలని నేను భారతీయ రాజకీయ నాయకులందరినీ వేడుకుంటున్నాను. ఉక్రెయిన్‌కు ఆయుధ మద్దతు మాత్రమే కాదు, మానసిక సహాయం కూడా అవసరం. దురాక్రమణదారు రష్యాను శిక్షించవలసి ఉంది. శాంతియుతంగా జీవిస్తున్న ఉక్రెయినియన్లను రష్యన్లు చంపుతుంది. ఓ సార్వభౌమాధికార దేశ మానవ హక్కులను కాపాడాలని భారత దేశంలోని రాజకీయ నాయకులందర్నీ కోరుతున్నాన‌ని తెలిపారు. 

దక్షిణ ఉక్రెయిన్‌లోని నౌకాశ్రయ నగరం ఓడెస్సా రష్యా బలగాలకు పడిపోయిందనే వార్తలను కూడా ఆమె తోసిపుచ్చారు.  ఇవన్నీ రష్యన్లు సృష్టిస్తున్న వదంతులేనని చెప్పారు.  ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర రెండవ రోజుకి ప్రవేశించడంతో.. భారతదేశం నుండి రాజకీయ, ఔషధ సహాయం కోరుతుంద‌ని తెలిపారు. సుమీ నగరంలోకి రష్యన్ దళాలు ప్రవేశించయ‌ని తెలిపారు. ప్రాంతీయ గవర్నర్, డిమిట్రో జివిట్‌స్కీ మాట్లాడుతూ, ఉక్రేనియన్ దళాలు రష్యన్ దళాలతో పోరాడాయి, అయితే ఇతర రష్యన్ కాన్వాయ్‌లు పశ్చిమాన ఉక్రేనియన్ రాజధాని వైపు తిరుగుతూనే ఉన్నాయని తెలిపారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌