సంక్రాంతి తర్వాత కేంద్ర క్యాబినెట్ విస్తరణ.. ఎన్నికల రాష్ట్రాల నుంచి ఎంపిక!

By Mahesh KFirst Published Dec 31, 2022, 6:14 PM IST
Highlights

సంక్రాంతి తర్వాత కేంద్ర మంత్రి మండలిని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల నుంచి పలువురు సీనియర్ నేతలను నూతన క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే, కొందరు సీనియర్ నేతలూ నూతన క్యాబినెట్‌లో చోటు కోల్పోబోతున్నట్టు సమాచారం.
 

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రిమండలి విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం అందింది. సంక్రాంతి తర్వాత ఈ మార్పులు జరగబోతున్నట్టు తెలిసింది. కొత్త మంత్రివర్గంలో ఎన్నికల రాష్ట్రాల నేతలు ఉండే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అంతేకాదు, ప్రస్తుతం క్యాబినెట్‌లోని కొందరు సభ్యులను బయటకు పంపే అవకాశాలు ఉన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. అందులో సీనియర్ నేతలు ఉండే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే వారి పర్ఫార్మెన్స్ రిపోర్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు సీనియర్ నేతలు సమీక్షించినట్టు వివరించాయి.

గతంలో క్యాబినెట్‌లో మార్పులు చేసినప్పుడు సీనియర్ నేతలు హర్షవర్ధన్, రమేశ్ పోక్రియాల్ నిశాంక్ వంటి వారు క్యాబినెట్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా కొందరు సీనియర్ నేతలు క్యాబినెట్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. అలాగే, క్యాబినెట్‌లోకి కొత్తగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల నుంచి తీసుకోవచ్చని ఆ వర్గాలు వివరించాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గడ్, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి నూతన క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం కూడా ముగుస్తున్నది. దానిపైనా నిర్ణయం తీసుకోబుతున్నట్టు సమాచారం.

click me!