మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది.. కావాలంటే రాసిస్తా..: రాహుల్ గాంధీ

By Mahesh KFirst Published Dec 31, 2022, 5:04 PM IST
Highlights

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా గెలిచి తీరుతుందని రాహుల్ గాంధీ అన్నారు. కావాలంటే పేపర్ పై రాసిస్తా అని హామీ ఇచ్చారు. ఇక్కడ ప్రజలందరికీ బీజేపీ అవినీతి తెలిసిపపోయిందని చెప్పారు.
 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ రోజు ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్‌క్వార్టర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా గెలిచి తీరుతుందని అన్నారు. కావాలంటే పేపర్ పై రాసిస్తా అని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ కనిపించకుండా పోతుందని వివరించారు. ఎక్కడా కనిపించదని అన్నారు. ఇది తన హామీ అని స్పష్టం చేశారు.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ అవినీతి ప్రజలందరి కళ్ల ముందే జరిగిందని, డబ్బులు గుమ్మరించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనే ప్రజలందరి ఆలోచనల్లో ఉన్నదని రాహుల్ గాంధీ అన్నారు. కాబట్టి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని వివరించారు. కాంగ్రెస్ ఊడ్చేస్తుందని చెప్పారు.

Latest Videos

అలాగే, 2024 సార్వత్రిక ఎన్నికల గురించి మాట్లాడుతూ ప్రతిపక్షాలన్నీ సమన్వయంలోకి రావాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. ప్రతిపక్షాలు ఒక ప్రత్యామ్నాయ లక్ష్యాన్ని, విజన్‌ను కలిగి ఉండాలని తెలిపారు. కేవలం ప్రజల వద్దకు వెళ్లితే సరిపోదని, ఆల్టర్నేటివ్ విజన్‌తో ప్రజల వద్దకు వెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ భావజాలంతో సారూప్యత ఉన్న పార్టీలు అన్నీ కలిసి రావాలని వివరించారు. ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్, మాయావతిల పేర్లను ఉటంకించారు.

Also Read: 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రతిపక్ష ప్రధాని అభ్యర్థి - కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్

అదే విధంగా బీజేపీని తాను గురువుగా భావిస్తున్నారని పేర్కొన్నారు. వారు తమపై ఎంత దాడి చేస్తే తాము అంత బలోపేతం అవుతామని తెలిపారు. వారు ఏం చేస్తున్నారు? ఏం చెబుతున్నారు? ఇవన్నీ జాగ్రత్తగా గమనించి వాటిని ఆచరించకుంటే చాలు అని అన్నారు.

తాను కన్యాకుమారి నుంచి పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు పెద్దగా లక్ష్యాలు ఏమీ పెట్టుకోలేదని, కానీ, పాదయాత్రలో తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని వివరించారు. అందరూ వచ్చి తన తో పాదయాత్రలో చేరారని అన్నారు. భారత్ జోడో యాత్రలో చేర డానికి ద్వారాలు తెరిచే ఉంటా యని చెప్పారు.

click me!