
న్యూఢిల్లీ: సాయుధ దళాలకు చెందిన అర్హులైన పెన్షన్ దారులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకాన్ని సవరించింది.అంతేకాదు ఈ పథకం కిందబకాయిలను చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 23న కేంద్ర కేబినెట్ ఈ మేరకు ఈ విషయమై ఆమోదం తెలిపింది.
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకాన్ని సవరించడంతో లబ్దిదారులకు మరింత ప్రయోజనం కలగనుంది. 2019 జూన్ 30 లోపుగా ఉద్యోగ విరమణ చేసిన సాయుధ దళాల సిబ్బంది వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానం కిందకు వస్తారు. 2019 జూలై నుండి ఈ ఏడాది జూన్ వరకు ఈ పథకం కింద బకాయిలనుచెల్లించనున్నారు. బకాయిల కింద రూ.23,638 కోట్లు చెల్లించనుంది కేంద్రం.
2019 జూలై 1 నుండి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ను చెల్లించనున్నారు. ఈ పథకం కింద 4.52 లక్షల మంది కొత్త లబ్దిదారులతో పాటు 25.13 లక్షల మందికి లబ్ది కలగనుంది. బకాయిలను నాలుగు అర్ధ సంవత్సర వాయిదాల్లో చెల్లించనున్నారు. పెన్షన్, గ్యాలంట్రీ అవార్డు విజేతలతో పాటు వారి కుటుంబ పెన్షనుదారులకు ఒకే విడతలో బకాయిలను చెల్లించనున్నారు.రక్షణ దళాల సిబ్బంది, కుటుంబ పెన్షన్ దారుల కోసం ఓఆర్ఓపీని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి పెన్షన్ ను రీ ఫిక్స్ చేయనున్నారు. ఎనిమిదేళ్లలో పెన్షన్ల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 57వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రతి ఏటా ఇందుకు గాను రూ. 7,123 కోట్లను ఖర్చే చేసింది మోడీ సర్కార్.