రైతులకు గుడ్ న్యూస్.. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం.. వివరాలు ఇవే..

By Sumanth KanukulaFirst Published Jun 7, 2023, 4:23 PM IST
Highlights

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పలు పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పలు పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వెల్లడించారు. క్వింటాల్ సాధారణ వరికి ప్రస్తుతం రూ. 2040 ఉండగా.. దానిని రూ. 143 పెంచినట్టుగా చెప్పారు. దీంతో క్వింటాల్ సాధారణ వరి కనీస మద్దతు ధర రూ. 2183కి చేరింది.  అలాగే క్వింటాల్ గ్రేడ్ -ఏ వరి ధర రూ. 163 పెరిగి రూ. 2203కి చేరిందని పీయూష్ గోయల్ తెలిపారు. 

సాగుదారులకు వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించడానికి, పంటల వైవిధ్యతను ప్రోత్సహించడానికి కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కనీస మద్దతు ధరను అనేక సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా పెంచాలని కేబినెట్ నిర్ణయించిందని వెల్లడించారు. ఇక, పెసర పంటకు అత్యధికంగా కనీస మద్దతు ధర పెరిగింది. క్వింటాల్ పెసర ధర రూ.7,755 నుంచి రూ.8,558కి పెంచినట్టుగా  కేంద్ర మంత్రి పీయూష్ గోల్ వెల్లడించారు. 

ఇక, పెసరకు 10.4 శాతం, నువ్వుల గింజలకు 10.3 శాతం, పొడవాటి ప్రధానమైన పత్తికి 10 శాతం, వేరుశెనగ నూనె 9 శాతం, మీడియం ప్రధానమైన పత్తికి 8.9 శాతం, వరికి 7 శాతం కనీస మద్దతు ధరను పెంచారు. 

ఈ కేబినెట్ భేటీలో మణిపూర్‌ హింస, బాలాసోర్‌ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోదీ, మంత్రులందరూ సంతాపం తెలిపారని గోయల్ తెలిపారు. కనీస మద్దతు ధరతో పాటు గురుగ్రా హుడా సిటీ సెంటర్ నుంచి సైబర్ సిటీ, గురుగ్రామ్ విత్ స్పర్ నుంచి ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే వరకు మెట్రో కనెక్టివిటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

click me!