ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు: కేంద్రం

By narsimha lodeFirst Published Jan 7, 2019, 3:18 PM IST
Highlights

ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 10  ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయనుంది

న్యూఢిల్లీ:  ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 10  ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయనుంది.రిజర్వేషన్లను 50 నుండి 60 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. రిజర్వేషన్ల పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

ఎన్నికలు సమీపిస్తున్నసమయంలో సోమవారం నాడు నిర్వహించిన కేంద్ర కేబినెట్ కీలకమైన నిర్ణయం తీసుకొంది.రిజర్వేషన్లను 50 నుండి 60 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకొంది. రేపు లోక్‌సభలో అగ్రవర్ణాల్లో వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో  10 శాతం  రిజర్వేషన్లను కల్పించడానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లును మంగళవారం నాడు పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

 రేపటితో శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. త్వరలోనే బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.అయితే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేనాటికి   ఎన్నికల వాతావరణం నెలకొంటుంది.

అయితే కేంద్రం తీసుకొన్న నిర్ణయంపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఏడాదికి రూ. 8 లక్షల ఆధాయం కంటే  తక్కువ ఉన్నవారే అర్హులని కేంద్రం ప్రకటించింది. 1000 చదరపు అడుగుల కంటే ఇంటిస్థలం ఉంటే రిజర్వేషన్లకు అనర్హులుగా కేంద్రం తేల్చి చెప్పింది.

click me!