ఢిల్లీలో దారుణం: పెంపుడు కుక్కపై రాయి వేశాడని..కాల్చి చంపాడు

sivanagaprasad kodati |  
Published : Jan 07, 2019, 11:49 AM IST
ఢిల్లీలో దారుణం: పెంపుడు కుక్కపై రాయి వేశాడని..కాల్చి చంపాడు

సారాంశం

ఎంతో ఇష్టంగా పెంచుకునే పెంపుడు జంతువులకు ఏ చిన్న కష్టం కలిగినా మనం తట్టుకోలేము. అయితే కొందరు దీనిని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఈ క్రమంలో తన కుక్కను కొట్టాడనే కోపంలో ఓ వ్యక్తి తోటి వ్యక్తిని కాల్చి చంపేశాడు

ఎంతో ఇష్టంగా పెంచుకునే పెంపుడు జంతువులకు ఏ చిన్న కష్టం కలిగినా మనం తట్టుకోలేము. అయితే కొందరు దీనిని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఈ క్రమంలో తన కుక్కను కొట్టాడనే కోపంలో ఓ వ్యక్తి తోటి వ్యక్తిని కాల్చి చంపేశాడు.

వివరాల్లోకి వెళితే..  ఢిల్లీ వెల్‌కమ్ కాలనీకి చెందిన ఆఫాక్ ఓ ఇంటి ముందు నడుచుకుంటూ వెళుతుండగా అక్కడే ఉన్న కుక్క అతడిని కరవడానికి ప్రయత్నించింది. దాని నుంచి తప్పించుకునే క్రమంలో ఆఫాక్ కుక్క మీదకు రాళ్లు విసిరాడు.

దీనిని గమనించిన ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి ఆఫాక్‌తో గొడవకు దిగాడు. వాదన తారాస్థాయికి చేరడంతో ఇంటి లోపలికి వెళ్లి తుపాకీతో బయటికి వచ్చి ఆఫాక్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన కాలనీ వాసులు ఆఫాక్‌ను ఆసుపత్రికి తరలించగా.. అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న కుక్క యాజమాని కోసం గాలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే