కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ 2026 ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కీలక ప్రకటనలు, పాలనాపరమైన నిర్ణయాలు, రంగాల వారిగా కీలక అంశాలు, వ్యవసాయం, రైల్వే, మౌళిక సదుపాయాలు, రక్షణ, హెల్త్ వంటి సమాచారం ఇక్కడ చూడండి..

12:31 PM (IST) Feb 01
న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ 2035 వరకు ఉండదు. అన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ కు ఇది వర్తిస్తుంది.
12:26 PM (IST) Feb 01
మత్స్యకారులకు డ్యూటీ ఉండదు.. విదేశీ పోర్టులకు తరలిస్తే ఎగుమతిగా గుర్తింపు... అంతర్జాతీయ ట్రావెల్స్ గూడ్స్ పై డ్యూటీ ప్రీ ఉంటుంది..
12:25 PM (IST) Feb 01
ఆదాయ పన్ను రిటర్న్ వెల్లడించినందుకు ఎలాంటి జైలు శిక్ష ఉండదు.. కేవలం ఫెనాల్టీ మాత్రమే ఉంటుంది. ఆదాయాన్ని దాచిపెట్టేవారికి మాత్రమే ఫెనాల్టీలు.
12:22 PM (IST) Feb 01
వ్యక్తిగతంగా ఉపయోగించే వస్తువులకుటారీఫ్ రేట్స్ 20 నుండి 10 శాతానికి తగ్గింపు
17 క్యాన్సర్ మెడిసిన్స్ కు టారీప్స్ తగ్గింపు
పేషెంట్స్ ఉపయోగపడే వస్తువులకు టారీఫ్స్ తగ్గింపు
12:19 PM (IST) Feb 01
ఇండియాలో తయారుచేసే వస్తువులకు ట్యాక్స్ తగ్గింపు
లెదర్, టెక్స్ టైల్స్ తగ్గింపు
డ్యూటీ ఫ్రీ వస్తువు
లెదర్, సింథటిక్ వస్తువుల తగ్గింపు
సోడియం యాంటీ మోనైట్ కస్టమ్స్ డ్యూటీ
సివిల్ ఆండ్ డిఫెన్స్ లో టారీఫ్స్ తగ్గింపు
ఎయిర్ క్రాప్ట్ తయారీ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
SEZ లో తయారయ్యే వస్తువులపై టారీఫ్స్ తగ్గింపు
12:15 PM (IST) Feb 01
డేటా సెంటర్ సర్వీసులకు కూడా ఊరట కల్పించేలా నిర్ణయాలు... క్లౌడ్ సర్వీసులకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే
12:13 PM (IST) Feb 01
మ్యాన్ పవర్ సరఫరా సంస్థలకు టిడిఎస్ తగ్గింపు
12:09 PM (IST) Feb 01
ఐటీ రంగంలో భారత్ టాప్... అందుకే ఈ రంగానికి ట్యాక్స్ లో ఊరట...ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్ చేసేలా ఏర్పాట్లు
12:06 PM (IST) Feb 01
విదేశీ ఆస్తుల ప్రకటనకు వన్ టైమ్ స్కీం అమలు చేయనున్నట్ల తెలిపారు.
12:04 PM (IST) Feb 01
ఐటిఆర్ చెల్లింపుకు 31 ఆగస్ట్ వరకు సమయం... TCS 5 శాతం నుండి 2 శాతానికి తగ్గింపు
12:03 PM (IST) Feb 01
ప్రతి జిల్లాకు ఓ బాలికల హాస్టల్ నిర్మించనున్నట్లు ప్రకటన... బాలికల చదువుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తాం.
12:00 PM (IST) Feb 01
డైరెక్ట్ ట్యాక్స్... న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం1 ఏప్రిల్ నుండి అమలు... సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు... ప్రమాద భీమాకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు.. ఎడ్యుకేషన్, మెడికల్ కు ట్యాక్స్ తగ్గింపు...
11:55 AM (IST) Feb 01
16వ ఫైనాన్స్ కమీషన్ సిపారసులు... వీటికి ఆమోదం తెలిపాం... దీని కింద రాష్ట్రాలు రూ.1.4 లక్షల కోట్లు 2026 లో అందిస్తాం... రూరల్, అర్బన్ లోకల్ బాడీస్ కు అందిస్తాం.
11:54 AM (IST) Feb 01
నార్త్ ఈస్ట్ స్టేట్స్... పర్యాటకం కోసం 4000 ఎలక్ట్రిక్ బస్సులు... బుద్దిస్ట్ సర్కిట్ అరుణాచల్, అస్సాం, మిజోరాం, త్రిపుర వంటి రాష్ట్రాలు...
11:52 AM (IST) Feb 01
దివ్యాంగజన్ కౌశల్ యోజన... వివిధ రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తాం... ట్రైనింగ్ అందిస్తాం
దివ్యాంగ్ సహారా యోజన... ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్.... పిఎం దివ్యాష కేంద్రాల ద్వారా ఉపయోగపడే వస్తువులు
11:49 AM (IST) Feb 01
కోకోనట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తి... కోకోనట్ ప్రమోషన్ స్కీమ్స్...
ఇండియన్ కోకో ను గ్లోబల్ బ్రాండ్
కోకో నట్, కోక్, శాండిల్ వుడ్.. వాల్ నట్స్, ఫై నట్స్ పంటలకు ప్రోత్సాహం
11:47 AM (IST) Feb 01
క్రీడా రంగంలో ఖేలో ఇండియా మిషన్... కోచింగ్, సపోర్ట్ స్టాప్ ఏర్పాటు... క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు..
చిన్న మధ్యతరగతి రైతులు, దివ్యాంగులకు, అణగారిన వర్గాలు సపోర్ట్స్
500 రిజర్వాయర్లను అమ్రుత్ సరోవర్ గా ఏర్పాటు
11:44 AM (IST) Feb 01
వరల్డ్ క్లాస్ ట్రెక్కింగ్ ఆండ్ హైక్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అరకు వ్యాలీ ఎంపిక. పులికాట్ లేక్ ను కూడా పర్యాటకానికి అనుకూలంగా మార్చడం...15 ఆర్కిలాజికల్ సైట్ ఏర్పాటుకు నిర్ణయం
11:42 AM (IST) Feb 01
పైలట్ స్కీమ్ గా 10 వేల గైడ్స్ కు స్కిల్ డెవలప్మెంట్... ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా ట్రైనింగ్
11:39 AM (IST) Feb 01
ముంబై-పుణే, పుణే-హైదరాబాద్, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-బెంగళరు, డిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి హైస్పీడ్ రైల్ కారిడార్స్ ఏర్పాటు
11:37 AM (IST) Feb 01
ఆరెంజ్ ఎకానమి అంటే గేమింగ్ టెక్నాలజీ... ఇందులో 2 మిలియన్ ఉద్యోగులు... కంటెంట్ క్రియేట్ ల్యాబ్స్ ఏర్పాటుకు నిర్ణయం
11:36 AM (IST) Feb 01
3 ఆయుర్వేద ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
11:34 AM (IST) Feb 01
మెడికల్ టూరిజం దిశగా 5 రీజినల్ మెడికల్ హబ్... ప్రైవేట్ సంస్థలతో కలిసి పార్టనర్ షిప్ లో ఏర్పాటు.. ఇవి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి.
11:32 AM (IST) Feb 01
25 కోట్ల ప్రజలు పేదరికం నుండి భయటకు వచ్చారు. ప్రభుత్వ చర్యలవల్లే సాధ్యమయ్యింది. ఎడ్యుకేషన్ ఆండ్ ఎంపవర్ కోసం హై పవర్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
11:30 AM (IST) Feb 01
ఇండియా బయట ఉన్నవారు లిస్టెట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం.. ఇందుకోసం పోర్ట్ పోలియో ఇండియా స్కీమ్
11:28 AM (IST) Feb 01
5 లక్షల లోపు జనాభా కలిగిన పట్టణాల్లో మౌళిక సదుపాయాలు కల్పన...టైర్ 2, 3 పట్టణాల డెవలప్ మెంట్ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
11:23 AM (IST) Feb 01
దేశంలో కొత్తగా 3 NIPER ఏర్పాట్లు.. అలాగే ప్రస్తుతం ఉన్నవాటిని ఆధునీకరించనున్నట్లు ప్రకటన
11:20 AM (IST) Feb 01
మెగా టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ పథకం మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
11:19 AM (IST) Feb 01
11:13 AM (IST) Feb 01
ఒడిషా, కేరళ, ఏపీ, తమిళనాడు కు రేర్ ఎర్త్ మైనింగ్ కు అవకాశం.. రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు
11:12 AM (IST) Feb 01
గ్లోబల్ బయో ఫార్మా మాన్యుఫాక్చరింగ్ హబ్ గా భారత్... ఇందుకోసం రూ.10,000 కోట్లు కోటాయింపు... ఫార్మాసుటికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు...
11:07 AM (IST) Feb 01
కర్తవ్యభవన్ లో ఈ మూడు కర్తవ్యాలతో బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిపారు.
ఎకనామిక్ గ్రోత్ ను పెంచడం
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం
సబ్ కా సాత్ సబ్ కా వికాస్
11:06 AM (IST) Feb 01
7 శాతం గ్రోత్ రేట్ తో ముందుకు సాగుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
11:04 AM (IST) Feb 01
లోక్ సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమయ్యింది, 2026-27 కు సంబంధించిన బడ్జెట్ ను ఆమె బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.
10:27 AM (IST) Feb 01
వికసిత్ భారత్ అంటే దేశాన్ని అభివృద్ది దిశగా వేగంగా నడిపించే బడ్జెట్ ను రూపుదిద్దుకుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు పేర్కొన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే బడ్జెట్ అవుతుందన్నారు.
10:23 AM (IST) Feb 01
బడ్జెట్ 2026 ఆమోదం కోసం పార్లమెంట్ లో కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మంత్రులంతా ఈ భేటీలో పాల్గొన్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
09:51 AM (IST) Feb 01
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి పంకజ్ చౌదరి బడ్జెట్ ప్రతులతో పార్లమెంట్ కు చేరుకున్నారు. వీరు బడ్జెట్ టీంతో కలిసి పార్లమెంట్ వద్ద ఫోటోలు దిగారు. మరికొద్దిసేపట్లో ప్రారంభంకానున్న మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ 2026-27 ను ఆమోదించనున్నారు.
09:41 AM (IST) Feb 01
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం గురించి యావత్ దేశం ఎదురుచూస్తోందని తెలంగాణ బిజెపి చీఫ్ రాంచంందర్ రవు అన్నారు. ఈ బడ్జెట్ దేశ ప్రగతికి, ప్రజలకు ఆశలకు సంబంధించిన కీలక అంశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
09:28 AM (IST) Feb 01
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. తొమ్మిదోసారి దేశ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న ఆమె ఎప్పటిలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు... బడ్జెట్ ప్రతులను అందించారు.
09:06 AM (IST) Feb 01
ఇప్పటికే ఆమె ఇంటినుండి ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్ధిక శాఖ సహాయమంత్రి, బడ్జెట్ తయారీ టీంతో పోటో సెషన్ అనంతరం ఆమె రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటారు. 10 గంటలకు పార్లమెంట్ కు చేరుకుంటారు... 10.15 కేబినెట్ మీటింగ్ లో పాల్గొంటారు. 11 గంటలకు లోక్ సభలో బడ్జెట్ 2026-27 ప్రసంగం ప్రారంభిస్తారు.