బడ్జెట్ 2021: సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..!

By telugu news team  |  First Published Feb 1, 2021, 2:26 PM IST

పన్ను రిటర్నులను రీఓపెన్ చేసే సమయం 6 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదిస్తున్నట్టు ఆమె వెల్లడించారు.  దీంతో పాటు మరికొన్ని పన్నుచెల్లింపు ప్రక్రియ చెల్లింపు సరళీకరణ చర్యలను ప్రకటించారు. 


లోక్ సభలో సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ బడ్జెట్ లో ఆమె సీనియర్ సిటిజన్లు భారీ ఊరట కల్పించారు. 75ఏళ్ల వయసు పైబడిన వారికి ఆదాయ పన్ను దాఖలులో మినహాయింపు ఇచ్చారు.

ఈ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఇది చాలా కీలకమైందని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు ఆన్‌ఐఆర్‌లకు డబుల్‌ టాక్సేషన్‌నుంచి ఊరటనిచ్చారు. అయితే ఈసారి బడ్జెట్‌లో ఆదాయ పన్నులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో 2021-22 బడ్జెట్‌పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ఉద్యోగులకు నిరాశే మిగిలింది. 

Latest Videos

పన్ను రిటర్నులను రీఓపెన్ చేసే సమయం 6 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదిస్తున్నట్టు ఆమె వెల్లడించారు.  దీంతో పాటు మరికొన్ని పన్నుచెల్లింపు ప్రక్రియ చెల్లింపు సరళీకరణ చర్యలను ప్రకటించారు. దీంతోపాటు స్టార్టప్‌లకు ట్యాక్స్ మినహాయింపు మరో ఏడాది  పొడిగిస్తున్నట్టు తెలిపారు. 

కాగా పెన్షన్, వడ్డీ ఆదాయం మాత్రమే ఉంటే 75 ఏళ్లు, అంతుకు పైబడిన  సినీయర్‌ సిటిజన్లకు టాక్స్‌ ఫైలింగ్ నుంచి మినహాయింపునిచ్చారు. అలాగే ఎన్నారై పెట్టుబడు దారులను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహాన్ని ప్రకటించారు. ఎన్నారైలు భారత్‌లో ఉండే గడువును 182 రోజుల నుంచి 120 రోజులకు కుదించారు. గత బడ్జెట్‌లో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ తొలగించామని పేర్కొన్న ఆమె ఫేస్‌లెస్ ఇన్‌కంట్యాక్స్ అప్పిలైట్ ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు.  2014లో 3.31 కోట్ల నుంచి 2020 నాటికి పన్ను చెల్లింపుదారులు 6.48 కోట్లకు పెరిగారని ఆమె తెలిపారు.
 

click me!