Uttarakhand: అధికారంలోకి వ‌స్తే యూనిఫామ్ సివిల్ కోడ్‌.. ఉత్త‌రాఖండ్ బీజేపీ నేత‌, సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Published : Feb 12, 2022, 11:37 AM IST
Uttarakhand: అధికారంలోకి వ‌స్తే యూనిఫామ్ సివిల్ కోడ్‌.. ఉత్త‌రాఖండ్ బీజేపీ నేత‌, సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సారాంశం

Uttarakhand: క‌ర్నాట‌క‌లో మొద‌లైన హిజాబ్ వివాదం ఇప్ప‌టికే ఇత‌ర రాష్ట్రాల‌కు సైతం పాకుతున్న‌ది. ఈ వివాదం కోర్టుల వ‌ర‌కు చేరింది. స‌ర్వ‌త్రా హిజాబ్ అంశం తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతున్న నేప‌థ్యంలో ఉత్త‌రాఖండ్ సీఎం, బీజేపీ నేత పుష్క‌ర్ సింగ్ ధామీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాము అధికారంలోకి వ‌స్తే రాష్ట్రంలో యూనిఫామ్‌ సివిల్ కోడ్ ( యూసీసీ) ను అమలు చేస్తామ‌ని పేర్కొన్నారు.  

Uttarakhand: క‌ర్నాట‌క‌లో మొద‌లైన హిజాబ్ వివాదం ఇప్ప‌టికే ఇత‌ర రాష్ట్రాల‌కు సైతం పాకుతున్న‌ది. ఈ వివాదం కోర్టుల వ‌ర‌కు చేరింది. స‌ర్వ‌త్రా హిజాబ్ అంశం తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతున్న నేప‌థ్యంలో ఉత్త‌రాఖండ్ (Uttarakhand) సీఎం, బీజేపీ నేత పుష్క‌ర్ సింగ్ ధామీ (CM Pushkar Singh Dhami) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాము మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే రాష్ట్రంలో యూనిఫామ్‌ సివిల్ కోడ్ ( యూసీసీ) (Uniform Civil Code) ను అమలు చేస్తామ‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం దేశంలోని ప‌లు ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించడంపై వివాదం నెల‌కొన్న‌ది. ప‌లు చోట్ల ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. క‌ర్నాట‌క‌లో అయితే, ప‌లు కాలేజీలు, పాఠ‌శాల‌లు మూత ప‌డ్డాయి. కోర్టులో ఇదే అంశంపై విచార‌ణ జ‌రుగుతోంది. 

ఇలా, హిజాబ్ వివాదం కొన‌సాగుతున్న త‌రుణంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ (CM Pushkar Singh Dhami)  చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. మ‌ళ్లీ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం అధికారం చేప‌డితే.. యూనిఫామ్‌ సివిల్ కోడ్ (Uniform Civil Code) ముసాయిదాను రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఖతిమాలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “ఉత్తరాఖండ్‌లో యూనిఫామ్‌ సివిల్ కోడ్‌ను త్వరగా అమలు చేయడం వల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కలుగుతాయి. ఇది సామాజిక సామరస్యాన్ని పెంపొందిస్తుంది. లింగ న్యాయాన్ని పెంపొందిస్తుంది. మహిళా సాధికారతను బలోపేతం చేస్తుంది. రాష్ట్రంలోని అసాధారణ సాంస్కృతిక-ఆధ్యాత్మిక గుర్తింపు మరియు పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడుతుంది” అని ముఖ్య‌మంత్రి పుష్క‌ర్ సింగ్ ధామీ (CM Pushkar Singh Dhami) చెప్పారు.

అలాగే, “నేను చేయబోయే ప్రకటన నా పార్టీ తీర్మానం (Uniform Civil Code), కొత్త భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నెరవేరుతుంది. 'దేవభూమి' సంస్కృతి మరియు వారసత్వాన్ని చెక్కుచెదరకుండా ఉంచడం మా ప్రధాన కర్తవ్యం, మేము దీనికి కట్టుబడి ఉన్నాము” అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ సైతం యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి శుక్ర‌వారం నాడు వ్యాఖ్యానించారు. యూనిఫాం సివిల్ కోడ్ ఆవశ్యకత, దీని గురించి పార్లమెంటుతో పాటు సమాజంలో కూడా చర్చించాలని అన్నారు. "దేశ వాతావరణాన్ని గందరగోళపరిచే లక్ష్యంతో కలవరపరిచే ధోరణి"గా అభివర్ణించారు. “కొంతమంది ఓట్ కే సౌదాగర్ (ఓటు డీలర్లు) తమ రాజకీయ ప్రయోజనాల కోసం పాఠశాలలో హిజాబ్ ధరించడం వంటి అశాస్త్రీయమైన డిమాండ్‌లకు మద్దతు ఇస్తున్నారు. ఇలాంటి వాళ్లు ఓట్ల కోసం అమాయక బాలికల జీవితాలతో ఆడుకుంటున్నారు’’ అని మండిపడ్డారు.

కాగా, ఉత్తరాఖండ్ (Uttarakhand) ఎన్నికల ప్రచారం శనివారంతో ముగియనుండగా, ఆ రాష్ట్రంలో సోమవారం ఓటింగ్ జరగనుంది. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ప్ర‌ధాన పోటీ నెలకొన్న‌ది. కాంగ్రెస్-బీజేపీలు నువ్వా-నేనా అనే విధంగా పోటీ ప‌డుతున్నాయి. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని రెండు పార్టీలు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !