Ungalil Oruvan: సీఎం స్టాలిన్ ఆత్మ‌క‌థ‌ .. 28న విడుద‌ల‌

Published : Feb 18, 2022, 02:19 PM ISTUpdated : Feb 18, 2022, 02:20 PM IST
Ungalil Oruvan: సీఎం స్టాలిన్ ఆత్మ‌క‌థ‌ .. 28న విడుద‌ల‌

సారాంశం

Ungalil Oruvan:త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆటోబ‌యోగ్ర‌ఫీ  'ఉంగలిల్ ఒరువన్' (Ungalil Oruvan) పుస్త‌కం తొలి భాగాన్ని ఈనెల 28వ తేదీన రాహుల్ గాంధీ రిలీజ్ చేయ‌నున్నారు. త‌మిళ‌నాడు సీఎంవో కార్యాల‌యం ఈ విష‌యాన్ని ఓ ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపింది.   

Ungalil Oruvan: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్ ఆటోబ‌యోగ్ర‌ఫీ 'ఉంగలిల్ ఒరువన్' (మీలో ఒకడు) తొలి భాగాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు. ఈనెల 28వ తేదీన పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఉంటుంద‌నీ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

పుస్త‌కావిష్క‌ర‌ణ‌కు కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా హాజరుకానున్నారు. ఎస్.దురైమురుగన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. త‌మిళ న‌టుడు స‌త్య‌రాజ్ ఈ పుస్త‌కాన్ని ప‌రిచ‌యం చేయ‌నున్నారు. 

 స్టాలిన్ తన పుస్తకంలో.. త‌న బాల్యం, పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయ ప్ర‌వేశం ఎలా చేశార‌నేది పేర్కొన్నట్లు తెలుస్తుంది. అలాగే.. పెరియార్‌, అన్నాదురై, తండ్రి కలైంజర్ క‌రుణానిధి, సి.ఎన్ వంటి గొప్ప నాయకుల నుంచి రాజ‌కీయ పాఠాలు నేర్చుకున్న‌ట్లు ఆ పుస్త‌కంలో తెలిపారు. 
 
ఈ పుస్తకంలో తమిళనాడు ముఖ్యమంత్రి పెరియార్, అన్నాదురై, కరుణానిధి సహా ద్రవిడ ఉద్యమ వ్యవస్థాపక నాయకులు చేపట్టిన పోరాటాలను కూడా ప్రస్తావించారు. ప్రజల సమస్యల కోసం సుదీర్ఘ పోరాటాల తర్వాత డీఎంకే ఎదుగుదల గురించి కూడా ఆయన పుస్తకంలో పేర్కోన్న‌ట్టు తెలుస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?