TMC poster: ఫెక్సీ వివాదం.. మమతాని 'దుర్గ'గా, ప్రధానిని 'మహిషాసురుడు' గా చిత్రీక‌ర‌ణ

Published : Feb 18, 2022, 01:42 PM IST
TMC poster: ఫెక్సీ వివాదం.. మమతాని 'దుర్గ'గా, ప్రధానిని 'మహిషాసురుడు' గా చిత్రీక‌ర‌ణ

సారాంశం

TMC poster: ప‌శ్చిమ బెంగాల్ లో మేదినీపూర్ నగరంలో ఫెక్సీల వివాదం చెల‌రేగింది.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని 'దుర్గ'గా, ప్రధాని నరేంద్ర మోడీని 'మహిషాసురుడు గా  కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రాక్షసుడు గా చిత్రీక‌రిస్తూ ఏర్పాటు చేశారు. దీంతో దూమారం రేగింది.   

TMC poster: పశ్చిమ బెంగాల్‌లో మున్సిపల్ ఎన్నికలకు మరికొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. దీంతో ప్రధాన పార్టీలు జోరుగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నాయి.  ఇదిలా ఉంటే.. అభ్యర్థుల జాబితాపై అధికార తృణమూల్ కాంగ్రెస్‌(Trinamool Congress)లో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించాయి. పార్టీ అగ్రనాయకులు దిద్దుబాటు చర్యలు చేపట్టేపనిలో పడ్డారు. 

ఇతర చర్యలతోపాటు, పార్టీ సభ్యుల ఫిర్యాదులను పరిశీలించేందుకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది తృణమూల్. ఈ సమస్య కారణం టీఎంసీ(TMC), ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) నేతృత్వంలోని పొలిటికల్ కన్సల్టెన్సీ I-PAC మధ్య విభేదాలు త‌లెత్తిన‌ట్టు వార్త‌లు వస్తున్నాయి.  

ఇదిలా ఉంటే.. పశ్చిమ బెంగాల్‌లోని మద్నాపూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ రాజ‌కీయ దూమారం రేపింది.  ఈ ఫెక్సీలో  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని 'దుర్గ'గా, ప్రధాని నరేంద్ర మోడీని, 
'మహిషాసురుడు గా చిత్రీక‌రిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ రాజ‌కీయ దూమారం రేపుతోంది. 
అంతేకాకుండా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రాక్షసుడు గా చిత్రీకరించారు. పోస్టర్‌లో ప్రతిపక్ష పార్టీలను మేకలుగా చూపిస్తూ.. ఎవరైనా వారికి [ప్రతిపక్ష పార్టీలకు] ఓటు వేస్తే..వారు కూడా బలి అవుతారనే వ్యాఖ్య కూడా ఆ ఫెక్సీలో ఉంది. ఈ వివాద‌స్ప‌ద ఫెక్సీ మద్నాపూర్ జిల్లాలో కలకలం రేపుతోంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేత‌లు రోడ్డును దిగ్బంధించారు. అనంత‌రం ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తారు (ఇసికి ఫిర్యాదు చేయడానికి బిజెపి) వివాదం తలెత్తిన వెంటనే పోస్టర్‌ను తొలగిస్తామని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. 

 TMC నాయకురాలిని దేవతలుగా, బీజేపీ నేత‌లకు రాక్ష‌సులుగా చూపించడం సనాతన ధర్మాన్ని అవమానించడమేనని స్థానిక బీజేపీ నాయకుడు విపుల్ ఆచార్య అన్నారు. ప్రధాని, హోంమంత్రిని కూడా అవమానించడమేనని ఆయన అన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి (ఈసీ) ఫిర్యాదు చేసిన‌ట్టు విపుల్ ఆచార్య తెలిపారు.

ఈ వివాద‌స్ప‌ద పోస్ట‌ర్ పై స్థానిక టీఎంసీ నేత అనిమా సాహా మాట్లాడుతూ.. ఈ ఫెక్సీని ఎవరు అంటించారో కూడా తనకు తెలియదని అన్నారు. ఈ విషయం తెలిసి ఉంటే, ఆ ప్రాంతంలో ఇలాంటి పోస్టర్లు పెట్టడానికి  తాను ఎప్పుడూ అనుమతించనని అని అనిమా సాహా అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో పౌర ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఫెక్సీ వివాదం చెలరేగింది. 108 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin Assets Full Details | Nitin Nabin 2025 Election | Loans, Property | Asianet News Telugu
సొంతూళ్లోనే ఉంటూ రోజుకు రూ.6-7 వేల సంపాదన.. ఓ మహిళ సక్సెస్ స్టోరీ