UNESCO: భారతదేశ ప్రముఖ నగరాలైన కోజికోడ్, గ్వాలియర్ లకు అరుదైన గుర్తింపు దక్కింది. ఈ రెండు నగరాలు యునెస్కో జాబితా చేర్చబడ్డాయి.
UNESCO: భారతదేశ ప్రముఖ నగరాలైన గ్వాలియర్, కోజికోడ్ లకు అరుదైన గుర్తింపు దక్కింది. ప్రతిష్టాత్మక యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ (UCCN)లో స్థానం లభించింది. ఈ విషయాన్ని యునెస్కో తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది.
యునెస్కో ప్రకారం.. గ్వాలియర్,కోజికోడ్ సహా ప్రపంచంలోని 55 నగరాలకు యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ (UCCN) జాబితాలో చోటు దక్కింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ 'సంగీతం' విభాగంలో ఈ ప్రతిష్టాత్మక జాబితాలోకి ప్రవేశించగా, కేరళకు చెందిన కోజికోడ్ 'సాహిత్యం' విభాగంలో ఈ జాబితాలో చేర్చబడింది. ఈ తరుణంలో యునెస్కో 55 నగరాల పూర్తి జాబితాను పంచుకుంది
undefined
వీటిలో బుఖారా (హస్త కళాలు,జానపద కళలు), కాసాబ్లాంకా (మీడియా ఆర్ట్స్), చాంగ్కింగ్ (డిజైన్), ఖాట్మండు (ఫిల్మ్), రియో డి జెనీరో (సాహిత్యం) వంటి నగారాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.ఇప్పటివరకు.. UCCN జాబితాలో 100 కంటే ఎక్కువ దేశాల నుండి 350 నగరాలు ఈ జాబితాలో చేర్చబడ్డాయి.
ప్రధాని ప్రశంసలు
యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ (యుసిసిఎన్)లో గ్వాలియర్, కోజికోడ్ లు చేర్చడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు.ప్రపంచ వేదికపై భారతదేశ సాంస్కృతిక చైతన్యం ప్రకాశిస్తోందని అన్నారు. భారతదేశం తన విభిన్న సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్బంగా కోజికోడ్, గ్వాలియర్ ప్రజలకు ప్రధాని అభినందనలు తెలియజేస్తూ ట్విట్ చేశారు.