ఇండియన్ నేవీ బంగాళాఖాతం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించింది. ఇది తన అన్ని పారామీటర్లను విజయవంతంగా చేరుకుందని నేవీ అధికారులు తెలిపారు.
BrahMos missile : భారత నౌకాదళం (Indian Navy) బ్రహ్మోస్ క్షిపణిని భారత నౌకాదళం బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. బంగాళాఖాతంలోని తన యుద్ధనౌక నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఆపరేషన్ సన్నద్ధతలో భాగంగా ఇండియన్ నేవీ చేపట్టిన ఈ పరీక్ష బ్రహ్మోస్ అన్ని పారామీటర్లను విజయవంతంగా చేరుకుంది. భారత నావికాదళానికి చెందిన తూర్పు కమాండ్ కు చెందిన బంగాళాఖాతంలో టెస్ట్ ఫైర్ జరిగింది.
చంద్రబాబు కేసులో వైఎస్ జగన్ కు తెలుగుదేశం పార్టీ సూటి ప్రశ్నలు..
undefined
ఇది నీలి జలాల నిర్వహణ సన్నద్ధతకు, చైనా నావికాదళం సన్నద్ధతకు ఇది సగటు సన్నద్ధత. ఇంతకుముందు కూడా నౌకాదళం బహుళ సామర్థ్యాలు, పరిధులతో బ్రహ్మోస్ క్షిపణుల విస్తృత శ్రేణిని ప్రయోగించింది.
An destroyer of carried out successful firing of missile in the .
The missile achieved all mission objectives. pic.twitter.com/MUzNdvuft1
కాగా.. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశం-రష్యా జాయింట్ వెంచర్ గా సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి చేస్తుంది. వీటిని జలాంతర్గాములు, నౌకలు, విమానాలు, ల్యాండ్ ప్లాట్ ఫారమ్స్ నుంచి 2.8 మాక్ వేగంతో, ధ్వని కంటే దాదాపు మూడు రెట్లు వేగంతో ప్రయోగించవచ్చు. భారత్ కూడా బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.