
Uttarakhand Recruitment Scam: డెహ్రాడూన్ లో నిరుద్యోగుల నిరసన మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తరాఖండ్ లో నిరుద్యోగులు ఆందోళనల నేపథ్యంలో పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డెహ్రాడూన్ లో144 సెక్షన్ విధించారు.
వివరాల్లోకెళ్తే.. ఉత్తరాఖండ్‌లో రిక్రూట్‌మెంట్ స్కామ్‌లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ డెహ్రాడూన్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసనలు గురువారం హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలోనే పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. యూనియన్ అధ్యక్షుడు బాబీ పన్వార్‌ను కూడా అరెస్టు చేసినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు డెహ్రాడూన్ జిల్లాలో 144 సెక్షన్ విధించారు.
"నిరుద్యోగ సంఘం ప్రదర్శనలో రాళ్లు రువ్విన ఘటనలో యూనియన్ అధ్యక్షుడు బాబీ పన్వార్‌తో సహా 13 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాళ్లదాడిలో 15 మంది పోలీసులు గాయపడ్డారు. డెహ్రాడూన్ జిల్లాలో సెక్షన్ 144 విధించబడింది" అని డెహ్రాడూన్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (డీఎం) సోనికా తెలిపినట్టు ఏఎన్ఐ నివేదించింది. మరోవైపు పోలీసులు లాఠీచార్జి చేసిన ఘటనపై వివరణాత్మక మెజిస్టీరియల్ విచారణకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు.
నిరసన హింసాత్మకంగా మారడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయవలసి వచ్చింది. విద్యార్థులు రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఇందులో 15 మంది పోలీసులు గాయపడ్డారు. అనేక మంది నిరుద్యోగులు, విద్యార్థులు గాయపడ్డారు. బుధవారం తమ ధర్నాను విరమించమని పోలీసులు బలవంతం చేయడంతో నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. "లా అండ్ ఆర్డర్ పరిస్థితి, లాఠీ చార్జ్ మొత్తం క్రమంపై వివరణాత్మక మెజిస్ట్రియల్ విచారణ కోసం ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు" అని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపినట్టు ఏఎన్ఐ నివేదించింది.
Dehradun, Uttarakhand | The protesters who were agitating and demanding a CBI inquiry into recruitment irregularities are now being detained by the Police. pic.twitter.com/G4SaF3QbVh
"అన్ని వాస్తవాలు, ఇతర పరిస్థితులను తనిఖీ చేసిన తర్వాత, విచారణ అధికారి వివరణాత్మక విచారణ నివేదికను ప్రభుత్వానికి అందుబాటులో ఉంచుతారు" అని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. పరీక్షా పత్రాల లీకేజీ కారణంగా పలు పరీక్షలు రద్దు కావడంతో ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల ఫైర్ లైన్‌లో ఉంది. "విద్యార్థులు పటిష్టమైన పరీక్షా విధానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం కారణంగా ఉద్యోగాల కొరత ఉంది, అప్పుడు పేపర్ లీక్ చేయబడి.. పరీక్షలు రద్దు చేయబడింది. విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు వారిపై లాఠీఛార్జ్ చేయడం దురదృష్టకరం" అని మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ పేర్కొన్నారు.
UKPSC పేపర్ ఇటీవలే రాష్ట్రంలో లీక్ అయింది, ఫలితంగా దాదాపు 1.4 లక్షల మంది అభ్యర్థులకు పట్వారీ లేఖపాల్ పరీక్ష రద్దు చేయబడింది. ఈ క్రమంలోనే విద్యార్థులు, నిరుద్యోగ యువత ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.