పెళ్లి కావడం లేదని.. ఓ యువకుడు ఏం చేశాడంటే..?  

Published : Jun 23, 2023, 11:45 PM IST
పెళ్లి కావడం లేదని.. ఓ యువకుడు ఏం చేశాడంటే..?  

సారాంశం

పెళ్లి కావడంలేదని మనస్థాపంతో ఓ యువరైతు  ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన  కర్ణాటకలోని హవేరీ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. 

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టం. యువతి యువకులు పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తమకు నచ్చిన వారిని తన జీవిత భాగస్వామిగా తెచ్చుకోవాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది ప్రేమించి తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటే..మరికొంతమంది పెద్దలు కుదుర్చిన వివాహనికి ఓకే చెప్పుతుంటారు. అయితే.. పెళ్లి చేసుకోవాలంటే.. అంతా సులభమైన పని కాదు. ఒకప్పుడు 25 ఏళ్ల లోపే పెళ్లిళ్లు చేసుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం 30 ఏళ్ళు దాటిన తర్వాత కూడా వివాహం చేసుకోవడం లేదు. అదే సమయంలో చిన్నవయస్సులో కూడా పెళ్లి చేసుకోవడానికి ఎవరు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. 

ఇదిలా ఉంటే.. మరికొంతమంది ఎన్ని సంబంధాలు చూసినా వారికి పెళ్లి ఫిక్స్ కావడం లేదనీ, పెళ్లి కావడం లేదని మనస్థాపం చెందుతున్నారు. ఈ క్రమంలోనే మనస్థాపంతో కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. పెళ్లి కావడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చాడు. ఈ ఘటన కర్ణాటకలోని హవేరీ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హవేరీ జిల్లాలోని బ్యాడగి చెందిన  మంజునాథ్ నాగనూర్‌ (36) దాదాపు ఎనిమిదేళ్లుగా పెళ్లి చేసుకుందామని వధువు కోసం అన్వేషిస్తున్నాడు. కానీ అతని ప్రయత్నాలు ఫలించలేదు. అతను తీవ్ర నిరాశకు గురయ్యాడు. గత కొన్ని రోజుల నుంచి పెళ్లి కాలేదనే బెంగతో మద్యానికి బానిసయ్యాడు.పెళ్లి విషయమై కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే అంతర్గత వేదనను తెలియజేస్తూ ఓ సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్య చేసుకున్నాడు. వధువు దొరక్క తన తల్లిదండ్రులను వేదనకు గురవుతున్నారనీ మంజునాథ్ నోట్‌లో పేర్కొన్నాడు. నిస్సహాయత,నిరాశతో తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నట్టు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.  బ్యాడగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌