చిన్న వయసులోనే డాక్టర్, ఆ తర్వాత కలెక్టర్.. ఈ రెండింటినీ వదిలేసి.. కోట్లు సంపాదిస్తున్న యువకుడు

Published : Aug 08, 2023, 12:48 PM IST
చిన్న వయసులోనే డాక్టర్, ఆ తర్వాత కలెక్టర్.. ఈ రెండింటినీ వదిలేసి.. కోట్లు సంపాదిస్తున్న యువకుడు

సారాంశం

డాక్టరో, ఇంజనీరో లేదా కలెక్టరో ఏదో ఒకటి కావాలని చాలా మంది కలలుగంటుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం చిన్నవయసులోనే డాక్టర్ అయ్యాడు. ఆ తర్వాత కలెక్టర్ అయ్యాడు. ఈ రెండింటినీ వదిలేసి ఒక స్టార్టప్ ను స్టార్ట్ చేసి కోట్లలో సంపాదిస్తున్నారు. ఇది అసాధ్యమేనా అనిపిస్తుంది కదా.. కానీ ఇది నిజమైన కథే.. 

అనుకుంటే సాధ్యం కానిదేమున్నది అన్న మాటను వినే ఉంటారు. కానీ మనలో చాలా చిన్న చిన్న కష్టాలకే భయపడిపోతుంటారు. మరికొంతమంది ఇష్టం లేని జాబ్ అయినా సరే ఒక మెషిన్ లా పనిచేస్తారు. ఇది పోతే ఇంకేదీ దొరకదేమోనని. కానీ ఓ వ్యక్తి మాత్రం నచ్చిన పనికోసం గొప్ప గొప్ప ఉద్యోగాలను వదులుకున్నాడు. అవును అతను ముందు డాక్టర్ అయ్యాడు. ఇది వదిలేసి కలెక్టర్ అయ్యాడు. ఇది కూడా నచ్చకపోవడంతో స్టార్టప్ ను స్టార్ట్ చేసి కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ఆ స్టార్టప్ మరేదో కాదు.. అన్ అకాడమీ. కేవలం ఐదేండ్లలోనే ఈ అన్ అకాడమీ భారతదేశపు ప్రముఖ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ గా మారింది. 10 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లతో, ప్రతి ఒక్కరికీ సరసమైన, నాణ్యమైన విద్యను అందిస్తోంది. అసలు ఈ స్టార్టప్ కంపెనీ ఇంత తక్కువ సమయంలో ఎలా సక్సెక్స్ అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం..

గౌరవ్ ముంజాల్ గూగుల్ మాజీ ఉద్యోగి. ఇతను 2010లో అన్అకాడమీని స్థాపించారు. ఈ సంస్థ యూట్యూబ్ ఛానెల్ గా స్టార్ట్ అయ్యింది.  2015లో అన్అకాడమీ ఈడీఎక్స్ ప్లాట్ఫామ్ పై తొలి ఆన్లైన్ కోర్సును స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి వారు తమ కోర్సు ఆఫర్లను చాలా ఫాస్ట్ గా విస్తరించారు. ప్రస్తుతం 1000 కి పైగా కోర్సులను అందిస్తున్నారు. అన్అకాడమీ అనేది ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇది స్కూల్ స్థాయి నుంచి పోటీ పరీక్షల వరకు అన్ని సబ్జెక్టుల్లో ఉచిత, చెల్లింపు కోర్సులను అందిస్తోంది. ఇది యూపీఎస్సీ ప్రిపరేషన్, జాబ్ స్కిల్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ వంటి మరెన్నో అందిస్తోంది. దీనికి మిలియన్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు, 1000 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం అన్అకాడమీ ఇండియా నెంబర్ వన్ ఎడ్యుకేషన్ పోర్టల్ గా మారింది.

అన్అకాడమీ వ్యవస్థాపకులు గౌరవ్ ముంజాల్, సచిన్ గుప్తా, రోమన్ సైనీ నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో దీన్ని స్థాపించారు. ఇది వీలైనంత ఎక్కువ మందికి చేరువయ్యేందుకు వివిధ అంశాలపై ఉచిత యూట్యూబ్ వీడియోలను కూడా రూపొందించారు. 

అన్అకాడమీ వ్యవస్థాపకులు:

ఈ అభ్యాస వేదికను మొదటగా విద్యావేత్త గౌరవ్ ముంజాల్ స్థాపించారు. ఆ తర్వాత దీనిలోకి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హేమేష్ సింగ్, రోమన్ సైనీ చేరారు.

గౌరవ్ ముంజాల్

భారతదేశపు అతిపెద్ద ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్అకాడమీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ గౌరవ్ ముంజాల్. మంచి విద్యావేత్త అయిన ఈయన 10 ఏండ్లుగా విద్యారంగంలో పనిచేస్తున్నారు. ఈయన ఇంజనీర్ గా కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత అధ్యాపకుడిగా మారి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఐఐటీ అభ్యర్థుల నుంచి స్కూల్ పిల్లల వరకు అన్ని వయసుల విద్యార్థులకు బోధించారు. గౌరవ్ కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే కాదు పారిశ్రామికవేత్త కూడా. అన్అకాడమీ కంటే ముందు ఎడ్యుకేషన్ స్పేస్ లో రెండు కంపెనీలను స్థాపించారు. నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే తపనతో ఉన్న ఆయన ఇందులో సాంకేతిక పరిజ్ఞానం పెద్ద పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నారు. ఇదే అన్అకాడమీని ప్రారంభించడానికి ప్రేరేపించిందట.

హేమేష్ సింగ్

మోతీలాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయిన హేమేష్ సింగ్ భారతదేశంలోని టాప్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ లో ఒకటైన అన్అకాడమీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ. ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించడానికి ముందు హేమేష్ గూగుల్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశాడు.

రోమన్ సైనీ

డాక్టర్ రోమన్ సైనీ భారతదేశపు అతిపెద్ద ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న ఈయన దశాబ్దానికి పైగా టెక్నాలజీ రంగంలో పనిచేశారు.  రోమన్ నాయకత్వంలో అన్అకాడమీ గణనీయమైన వృద్ధిని సాధించింది. ఈ ప్లాట్ఫామ్ ఇప్పుడు 12 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ వినియోగదారులను కలిగి ఉంది. అలాగే వివిధ సబ్జెక్టులలో విద్యా కోర్సులను అందిస్తోంది. పారిశ్రామికవేత్తగా ఎదగాలనే స్ఫూర్తితో మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి ఉద్యోగానికి రాజీనామా చేశారు. చిన్నప్పటి నుంచి ఎంతో నిజాయితీ గల విద్యార్థి అయిన ఆయన తన 16వ ఏట ఢిల్లీలోని ఎయిమ్స్ కళాశాలలో వైద్య ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.ఎంబీబీఎస్ చదవడానికి ఎయిమ్స్ కు వెళ్లిన ఆయన డాక్టర్ అయ్యాక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రతిష్ఠాత్మక పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 22 ఏళ్లకే ఐఏఎస్ అధికారి అయ్యారు.

కేవలం ఐదేండ్లలోనే.. 

అన్అకాడమీ భారతదేశం అంతటా విద్యార్థులు, నిపుణులకు అభ్యసన వనరుగా మారింది. భారతదేశపు అగ్రశ్రేణి విద్యావేత్తల నుంచి నేర్చుకోవడానికి ఇదొక మంచి వేదిక. అన్అకాడమీ బృందం భారతదేశంలోని ఉత్తమ విద్యావేత్తలను గుర్తించి, వారి జ్ఞానాన్ని దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో పంచుకోవడానికి ఒక వేదికను అందిస్తోంది. లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇప్పుడు 10 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ వినియోగదారులు, 250,000 మంది అధ్యాపకులతో భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ లలో ఒకటిగా ఉంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్, హిస్టరీ, జాగ్రఫీ వంటి సబ్జెక్టులకు సంబంధించిన కోర్సులను ఈ ప్లాట్ఫామ్ అందిస్తోంది. కేవలం ఐదేండ్లలోనే లెర్నింగ్ ప్లాట్ఫామ్ ముగ్గురు వ్యక్తుల బృందం నుంచి 250 మందికి పైగా ఉద్యోగుల కంపెనీగా ఎదిగింది. 6 సంవత్సరాలలోనే అన్అకాడమీ అతిపెద్ద ఆన్లైన్ ప్లాట్ఫామ్ గా మారింది. దాని నికర విలువ 2 బిలియన్లకు చేరుకుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే