
భువనేశ్వర్: ఒడిశాలో క్రికెట్ మ్యాచ్ విషాదంగా మారింది. క్రికెట్ మ్యాచ్‌లో అంపైరింగ్ చేస్తున్న యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ అంపైర్‌ను బ్యాట్‌తో బాదారు. కత్తితో పొడిచారు. హాస్పిటల్ తీసుకెళ్లేలోపే ఆ యువకుడు మరణించాడు. ఈ ఘటన కటక్ జిల్లా మహిశాలంద పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది.
చౌద్వార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ క్రికెట్ గేమ్ ఆడారు. మహిశాలంద గ్రామానికి చెందిన కొందరు ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఆడారు. అందులో అంపైర్‌గా 22 ఏళ్ల లక్కీ రౌత్‌గా గుర్తించారు. ఆ మ్యాచ్ జరుగుతుండగా ఓ వివాదం రగులుకుంది. ఓ బంతిని అంపైర్‌గా ఉన్న లక్కీ రౌత్ నోబాల్‌గా డిక్లేర్ చేశాడు. దీనిపై వివాదం మొదలైంది.
ఈ వివాదం తీవ్రతరమైంది. దీంతో ఆ అంపైర్ పైనే దాడి జరిగింది. తొలుత బ్యాట్‌తో దాడి జరిగింది. ఆ తర్వాత కత్తితో పొడిచారు. ఈ దాడిలో అంపైర్ లక్కీ రౌత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఛాతి, పొట్టలో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనను కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌కు క్రిటికల్ కండీషన్‌లోనే తరలించారు.
లక్కీ రౌత్ ఆ హాస్పిటల్ వచ్చే లోపే మరణించాడని వైద్యులు తెలిపారు. చౌద్వార్ పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన జరిగిన చోట ఇంకా ఉద్రిక్తతలే ఉన్నాయి. నిందితులను పట్టుకోవడానికి గాలింపులు జరుగుతున్నాయి.