కరోనా ఎఫెక్ట్: రేపటి నుండి డొమెస్టిక్ విమానాలు రద్దు

By narsimha lodeFirst Published Mar 23, 2020, 5:26 PM IST
Highlights

కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇప్పటికే కేంద్రం అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. మరో వైపు డొమెస్టిక్ విమానాలను కూడ ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి నుండి నిలిపివేయాలని సివిల్ ఏవియేషన్ శాఖ నిర్ణయం తీసుకొంది.

న్యూఢిల్లీ: కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇప్పటికే కేంద్రం అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. మరో వైపు డొమెస్టిక్ విమానాలను కూడ ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి నుండి నిలిపివేయాలని సివిల్ ఏవియేషన్ శాఖ నిర్ణయం తీసుకొంది.

దేశంలో సోమవారం నాటికి కరోనా పాజిటివ్ కేసులు 415 కు చేరుకొన్నాయి. దేశంలోని సుమారు 75 జిల్లాల్లో లాక్ డౌన్ ను ప్రకటించింది కేంద్రం. దేశంలో కరోనా రెండో దశలో ఉందని కేంద్రం అభిప్రాయంతో ఉంది.

దీంతో దేశ వ్యాప్తంగా ప్రజా రవాణాను నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొన్నాయి. ఇందులో భాగంగానే మార్చి 31వ తేదీ వరకు రైళ్ల రాకపోకలను నిషేధించారు. గూడ్స్ రైళ్లు మాత్రమే నడపనున్నారు.

also read:కరోనా ఎఫెక్ట్: మలేరియా డ్రగ్ క్లోరోక్విన్ ను రికమెండ్ చేసిన ఐసీఎంఆర్

ఇప్పటికే అంతర్జాతీయ విమానాలను కేంద్రం రద్దు చేసింది. మరో వైపు రాష్ట్రాల మధ్య కూడ విమానాలను కూడ రద్దు చేయాలని నిర్ణయం తీసుకొంది. డొమెస్టిక్ విమానాలను మంగళవారం నాడు అర్ధరాత్రి నుండి నిలిపివేయాలని డీజీసీఏ నిర్ణయం తీసుకొంది.

అయితే సరుకులు రవాణాను  చేసే కార్గో విమానాలకు మాత్రం ఇందుకు మినహాయింపు ఇచ్చారు.  తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు డొమెస్టిక్ విమానాలు కూడ నిలిపివేస్తామని డీజీసీఏ ప్రకటించింది.

click me!