
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన, యూనిఫాం సివిల్ కోడ్ చట్టాన్ని శివసేన (ఉద్ధవ్ వర్గం) లక్ష్యంగా చేసుకుంది. ప్రధాని మణిపూర్ వెళ్లడం లేదని, అమెరికా వెళ్తున్నారని పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. అంతే కాకుండా దేశంలో గోహత్య చట్టాన్ని బీజేపీ అమలు చేయలేక పోతే యూనిఫాం సివిల్ కోడ్ ఎలా అమలవుతుందని అన్నారు. ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో శివసేన (ఉద్ధవ్ వర్గం) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగించారు.
మణిపూర్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందనీ, రోజురోజుకు హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని అన్నారు.ప్రధాని మోడీకి ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించే సమయం లేదు.. కానీ, అమెరికా కు వెళ్తే సమయముందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండను అరికట్టేందుకు ఆయన ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతింపజేశామని ప్రధాని చెప్పుకుంటున్నారని, అయితే మణిపూర్‌లో హింసను ఎందుకు ఆపడం లేదని థాకరే అన్నారు. ప్రధాని రాష్ట్రంలో శాంతిని నెలకొల్పితే, ఆయన వాదనను మనం విశ్వసించవచ్చని అన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పిన ఉద్ధవ్ ఠాక్రే.. పానిపట్ యుద్ధంలో ఓ 'షా' ఉండేవాడని అన్నారు. ఈ సందర్భంగా ఆయన అహ్మద్ షా అబ్దాలీని ఉద్దేశించి అన్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాలపై ఉద్ధవ్ మాట్లాడుతూ.. బాహుబలి, బజరంగబలిని ఆపినందుకు కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. యూనిఫాం సివిల్ కోడ్ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఉద్ధవ్.. యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేస్తామన్నారు. కానీ, దేశంలో గోహత్యను ఆపలేనప్పుడు యూనిఫాం సివిల్ కోడ్ ఎలా తెస్తారని ప్రశ్నించారు.
ప్రతిపక్షాల ఐక్యత
విపక్షాల ఐక్యత ఆధ్వర్యంలో పాట్నాలో జరిగే సమావేశానికి తాను కూడా హాజరవుతానని మాజీ ముఖ్యమంత్రి ఠాక్రే చెప్పారు. జూన్ 23న జరగనున్న సభ కేవలం ప్రతిపక్ష పార్టీల సమావేశం మాత్రమే కాదు, దేశాన్ని ప్రేమించే ప్రజల సమావేశం. దేశ స్వాతంత్య్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వారి సమావేశం జరుగుతోంది. దేశభక్తుల సమావేశం జరుగుతోందని అన్నారు. ఈ సమావేశానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ తనని ఆహ్వానించారని థాకరే అన్నారు.
జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 చాలా సంవత్సరాల క్రితం రాష్ట్రం నుండి తొలగించబడిందని థాకరే అన్నారు. అయితే ఇప్పటి వరకు అక్కడ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు? నేటికీ అక్కడ హిందువులు ఎందుకు ప్రమాదంలో ఉన్నారు? అని నిలాదీశారు. అదే సమయంలో యూనిఫాం సివిల్ కోడ్ గురించి మాట్లాడుతూ యూనిఫాం సివిల్ కోడ్‌ను స్వాగతిస్తున్నామనీ, కానీ అది హిందువులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందా? వారు (బిజెపి) దేశం మొత్తం మీద గోహత్య నిషేధాన్ని అమలు చేయలేకపోతే, యుసిసిని ఎలా అమలు చేస్తారు?" అని ప్రశ్నించారు. లా కమీషన్ ఇటీవల దీనిని పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ఇందులో మతపరమైన, సామాజిక సంస్థల వ్యక్తులు పాల్గొంటారు.