యోగికి ఉద్ధవ్ పంచ్: యూపీ సాధువుల హత్యపై ఫోన్

By Sree sFirst Published Apr 28, 2020, 7:19 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ బులంద్ షహర్ లోని ఒక గుడిలో  నిన్న రాత్రి ఇద్దరు సాధువుల హత్య జరిగింది. రాజు అనే వ్యక్తి గంజాయి మత్తులో వెళ్లి వారిని హత్య చేసాడు. ఇదే వ్యక్తిపై గతంలో ఈ ఇద్దరు సాధువులు దొంగతనం చేసాడనే నేరారోపణలు చేసారు. 

ఉత్తరప్రదేశ్ బులంద్ షహర్ లోని ఒక గుడిలో  నిన్న రాత్రి ఇద్దరు సాధువుల హత్య జరిగింది. రాజు అనే వ్యక్తి గంజాయి మత్తులో వెళ్లి వారిని హత్య చేసాడు. ఇదే వ్యక్తిపై గతంలో ఈ ఇద్దరు సాధువులు దొంగతనం చేసాడనే నేరారోపణలు చేసారు. 

అక్కడి స్థానిక పోలీసు అధికారి మాట్లాడుతూ... ఇందులో ఎటువంటి మతపరమైన కోణం లేదని, గంజాయి తీసుకున్న మత్తులో వెళ్లి ఆ సాధువులను హత్య చేసాడని గతంలో ఇతని మీద మోపిన నిందలను కూడా మనసులో పెట్టుకొని ఉండొచ్చని వారు తెలిపారు. 

అతడు పూర్తి మత్తులో ఉన్నందువల్ల ఆ మత్తు వదిలేంతవరకు తాము విచారణ చేయలేమని, ఆ మత్తు దిగాక విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. మత్తులో అతగాడు వింతగా వాగుతున్నాడని పోలీసులు అన్నారు. వారిని ఎందుకు చంపావు అంటే... అది దైవ నిర్ణయం అని అంటున్నాడట! ఈ వ్యక్తి ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. 

ఇకపోతే... ఈ సాధువులు మృతి చెందగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్ ఠాక్రే యోగి ఆదిత్యనాథ్ కి ఫోన్ చేసి మాట్లాడారు. మహారాష్ట్రలోని పాల్గర్ లో సాధువుల హత్యానంతరం యోగి ఆదిత్యనాథ్ హిందూ సాధువులకు న్యాయం జరగాల్సిందే అని మహారాష్ట్రలో జరిగిన సాధువుల హత్యకు మతం రంగును పులిమారు. 

మహారాష్ట్ర ప్రభుత్వం ఆ పాల్గర్ మూకదాడి కి మతానికి సంబంధం లేదని ఎంత చెప్పినా కూడా వినకుండా బీజేపీ నేతలు మతం రంగును పులిమారు. కానీ నిన్న యూపీ సంఘటనలో ఎవ్వరు కూడా మతం రంగును ఆ హత్యలకు ఆపాదించొద్దని శివసేన నేతలు కోరారు. 

ఉద్ధవ్ ఠాక్రే కూడా మా రాష్ట్రంలో ఎలాగైతే త్వరగా మేము నిందితులను పట్టుకున్నామో... అలాగే మీరు కూడా పెట్టుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపాడు. అందుకు యోగి ఆదిత్యనాథ్ కూడా త్వరలోనే దోషులకు శిక్ష పడేలా చేస్తామని అన్నారు. 

ఇకపోతే, పాల్గర్ లో ఇద్దరు సాధువులు ఒక మూక దాడిలో మరణించారు. పిల్లలను ఎత్తుకుపోయే ముఠా సంచరిస్తుందనే ఫేక్ న్యూస్ వాట్సాప్ లో విస్తృతంగా ప్రచారం అవడం వల్ల పొరపాటున ఆ సాధువులను చంపేశారు. 

ఈ దాడికి సంబంధించి 101 మందిని అదుపులోకి తీసుకున్నారు మహారాష్ట్ర పోలీసులు. 

click me!