Udaipur murder: ఉద‌య్‌పూర్ హ‌త్య వీడియోలను సోష‌ల్ మీడియాలో షేర్‌చేసిన ఐదుగురు అరెస్ట్ !

Published : Jul 05, 2022, 05:02 PM IST
Udaipur murder: ఉద‌య్‌పూర్ హ‌త్య వీడియోలను సోష‌ల్ మీడియాలో షేర్‌చేసిన ఐదుగురు అరెస్ట్ !

సారాంశం

Udaipur murder: ఉద‌య్‌పూర్‌లోని టైల‌ర్ ను ఇద్ద‌రుగు దుండ‌గులు అత్యంత క్రూరంగా గొంతు న‌రికి హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో దేశ‌వ్యాప్తంగా ఉద్రిక్తలు నెల‌కొన్నాయి.   

Udaipur murder: దేశ‌వ్యాప్తంగా సంచ‌న‌లం రేపిన ఉదయ్‌పూర్ హత్య వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు వేర్వేరు కేసుల్లో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయపూర్‌లో హత్య నిందితులు విడుదల చేసిన ఘటనకు సంబంధించిన వీడియోను ప్రసారం చేయవద్దని రాష్ట్ర పోలీసులు ప్రజలను కోరారు. అత్యంత క్రూర‌మైన ఈ వీడియో సోష‌ల్ మీడియ‌లో పంచుకున్న త‌ర్వాత వైర‌ల్ అయ్యాయి. అనేక ప్రాంతాల్లో దుద్రిక్త‌ల‌కు కార‌ణ‌మైంది. ఈ క్ర‌మంలోనే వీడియోల‌ను షేర్ చేసిన వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద‌య్‌పూర్ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాల‌తో పాటు మ‌రికొన్ని ఆయుధాల‌తో కూడిన వీడియోల‌ను నిందితులు పంచుకున్నారు.  

వివ‌రాల్లోకెళ్తే... ఉదయపూర్ హ‌త్య  ఘటనకు సంబంధించిన వీడియో సర్క్యులేట్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో నకిలీ ఆయుధాల ఫోటోలు, వీడియోలను అప్‌లోడ్ చేసినందుకు సంబంధించి వేర్వేరు కేసుల్లో ఐదుగురు వ్యక్తులను రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో సోమవారం నాడు ప‌లువురిని  అరెస్టు చేశారు. హనుమాన్‌గఢ్‌లోని సిరాజుద్దీన్‌ హుస్సేన్‌ (36)ని ఉదయపూర్‌ హత్య ఘటనకు సంబంధించిన వీడియోను ప్రసారం చేసినందుకు హనుమాన్‌గఢ్‌ పట్టణంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్‌ అజయ్‌సింగ్‌ తెలిపారు. మంగళవారం ఉదయపూర్‌లో హత్య నిందితులు విడుదల చేసిన ఘటనకు సంబంధించిన వీడియోను ప్రసారం చేయవద్దనీ, సోష‌ల్ మీడియాలో పంచుకోవ‌ద్ద‌ని రాష్ట్ర పోలీసులు ప్రజలను కోరారు. 

అలాగే, సంగరియా పోలీస్ స్టేషన్‌లో టార్సెమ్ పూరి (26)ని అరెస్టు చేసినట్లు సింగ్ తెలిపారు. సోషల్ మీడియాలో లైసెన్స్ పొందిన ఆయుధాలతో పోస్టులు చెలామణి చేస్తున్నందుకు ముగ్గురు నిందితులు రాజ్‌కుమార్ జాట్ (35), మహ్మద్ షకూర్ (50)లను సదర్ పోలీస్ స్టేషన్‌లోని ఏఎస్‌ఐ లాల్ చంద్ అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా, నకిలీ ఆయుధాలతో సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేసినందుకు పవన్ కుమార్ (21) ను నోహర్ పోలీస్ స్టేషన్ అదుపులోకి తీసుకుంది. కాగా, గ‌త కొంత కాలంగా న‌కిలీ, వివాదాల‌ను సృష్టించే పోస్టులు సోష‌ల్ మీడియాలో షేర్ కావ‌డం పెరుగుతున్న‌ది. వీటి కార‌ణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయ‌ని పోలీసులు పేర్కొంటున్నారు. సోష‌ల్ మీడియాలో ఫొటోలు, వీడియో దృశ్యాల‌ను పంచుకునే విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పోలీసులు ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు. హింస‌ను ప్రేరేపించే, వివాదాల‌ను సృష్టించే వీడియోల‌ను పంచుకోవ‌ద్ద‌ని చెబుతున్నారు. 

ఇదిలావుండ‌గా, భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) మాజీ అధికార ప్ర‌తినిధి నుపూర్ శ‌ర్మ ఓ టీవీ ఛానెల్ లైవ్ ప్రొగ్రామ్ లో మాట్లాడుతూ.. మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆమె వ్యాఖ్య‌లు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళ‌న‌ను, నిర‌స‌న‌లతో పాటు హింసాత్మ‌క వాతావ‌ర‌ణం సృష్టించింది. ఈ క్ర‌మంలోనే ఆమెకు మ‌ద్ద‌తు తెలుపుతూ ఉద‌య్‌పూర్‌కు చెందిన టైల‌ర్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే, నుపూర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ పోస్టు చేసిన వ్య‌క్తిని ఇద్ద‌రు దుండ‌గులు అత్యంత క్రూరంగా త‌ల న‌రికి చంపారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత పెద్ద ఎత్తున రాజ‌స్థాన్ లో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.  ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను షేర్ చేయవద్దని పోలీసులు ప్రజలను కోరారు. శాంతిని కాపాడాలంటూ పిలుపునిచ్చారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు