ఏడేళ్ల బాలికపై అత్యాచారం, ఆపై గొంతుకోసి.. అనుమానితులకు దేహశుద్ధి

Published : Jan 30, 2021, 11:52 AM IST
ఏడేళ్ల బాలికపై అత్యాచారం, ఆపై గొంతుకోసి.. అనుమానితులకు దేహశుద్ధి

సారాంశం

ఏడేళ్ల బాలికపై అత్యాచారం అత్యాచారం చేసి ఆ తరువాత గొంతుకోసి హత్యాయత్నం చేసిన దారుణ ఘటన ఒడిశాలో కలకలం రేపింది. విషయం తెలిసిన గ్రామస్తులు ఆగ్రహంతో ఇద్దరు అనుమానితులను విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు. 

ఏడేళ్ల బాలికపై అత్యాచారం అత్యాచారం చేసి ఆ తరువాత గొంతుకోసి హత్యాయత్నం చేసిన దారుణ ఘటన ఒడిశాలో కలకలం రేపింది. విషయం తెలిసిన గ్రామస్తులు ఆగ్రహంతో ఇద్దరు అనుమానితులను విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు. 

ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే పోలీసులను ఊర్లోకి రానివ్వకుండా గ్రామస్తులు అడ్డుకోవడంతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది. 

బాధిత గ్రామస్తులు, ఐఐసి అధికారి బాబులినాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం... గొళంత్ర పోలీసు స్టేషన్‌ పరిధిలోని సూన్ పూర్ మత్స్యకార గ్రామం. ఇదే ఊర్లో ఓ ఏడేళ్ల బాలిక ఒంటరిగా ఉండడం గమనించిన అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గ్రామ శివారులోని పాడుబడిన ఇంట్లోకి బలవంతంగా లాక్కెళ్లారు. 

అక్కడ చిన్నారిపై ఆ ముష్కరులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తరువాత చిన్నారి గొంతు కోసి హత్యకి ప్రత్నించారు. విషయం తెలిసిన సూన్‌పూరు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని అంబులెన్స్ లో ఎంకేసీజీ మెడికల్‌కి తరలించారు. 

అయితే నిందితులను ఎవ్వరూ చూడకపోవడంతో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను అనుమానితులాగా భావించి గ్రామస్తులు పట్టుకున్నారు. వీరిద్దరిపై  గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో మూకుమ్మడిగా దాడి చేసి చితకబాదారు. ఆ తరువాత విద్యుత్‌ స్తంభానికి కట్టేశారు. 

ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న గొళంత్రా పోలీసులు సూన్‌పూర్‌ గ్రామానికి చేరుకున్నారు. అయితే స్థానికులు పోలీసులను గ్రామ పొలిమేరల్లోనే అడ్డుకున్నారు. దీంతో పోలీసు అధికారులు, గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. 

చివరకు ఏదో విధంగా గ్రామస్తులకు నచ్చజెప్పి, తీవ్ర గాయాలతో ఉన్న అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నిందితులను పోలీసు స్టేషన్‌కు తరలించి, దర్యాప్తు చేస్తున్నామని ఐఐసీ అధికారి తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?