ఢిల్లీ పేలుళ్లు : ఇద్దరు అనుమానితుల గుర్తింపు.. ట్రయల్ మాత్రమే !

By AN TeluguFirst Published Jan 30, 2021, 11:12 AM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో పోలీసులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు. ఎంబసీ సమీపంలోని సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించారు. దీంట్లో పేలుడు జరగడానికి ముందు ఎంబసీ సమీపంలో ఓ వాహనం అనుమానాస్పదంగా కదులుతున్నట్టు గుర్తించారు. 

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో పోలీసులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు. ఎంబసీ సమీపంలోని సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించారు. దీంట్లో పేలుడు జరగడానికి ముందు ఎంబసీ సమీపంలో ఓ వాహనం అనుమానాస్పదంగా కదులుతున్నట్టు గుర్తించారు. 

సీసీ టీవీ ఫుటేజ్ లో క్యాబ్ లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు పేలుడు జరిగిన ప్రదేశానికి వచ్చినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులు ఆ క్యాబ్ ను గుర్తించి డ్రైవర్ ద్వారా ఆ వ్యక్తుల వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. 

ఇంతకు ముందే పేలుడు ప్రాంతంలో పోలీసులు ఓ ఎన్వలప్ ను, సగం కాలిన పింక్ స్కార్ఫ్ ను కనిపెట్టారు. ఎన్వలప్ లో ఓ నోటు ఉంది. దానిమీద ఇజ్రయిల్ అంబసీ అడ్రస్ తో ఇజ్రాయిల్ రాయబారికి వచ్చినట్టుగా ఉంది.  ఇది పేలుడు జరిగిన ప్రదేశానికి 12 గజాల దూరంలో దొరికింది. పోలీసులు ఈ లేఖ మీదున్న వేలిముద్రలను గుర్తించే పనిలో పడ్డారు. 

ఈ పేలుడు వెనక పెద్ద కుట్ర ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది కేవలం ట్రయల్ మాత్రమే అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు ఫోరెన్సిక్ బృందం తెలిపింది. దీనివల్లే పేలుడు జరిగిన ప్రాంతంలో చిన్న గుంట ఏర్పడింది. అదే ఆర్డీఎక్స్ పేలుడు పదార్థం ఉపయోగిస్తే ప్రభావం ఎక్కువగా ఉండేదని వారు చెబుతున్నారు. ఢిల్లీ పోలీస్ అడిషనల్ పిఆర్ఓ అనిల్ మిట్టల్ ఇదొక తుంటరి చర్యగా పేర్కొన్నారు. 

దీనిమీద ఫోర్స్ కేసు నమోదు చేసిందని, దాని స్పెషల్ సెల్ ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించిందని ఢిల్లీ పోలీస్ చీఫ్ ఎస్ఎన్ శ్రీవాస్తవ తెలిపారు. 

గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపులో జరిగిన బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్, ఉపాధ్యక్షుడు ఎం వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది కిలోమీటర్ల దూరంలో హాజరైనప్పుడు ఈ పేలుడు జరిగింది.

దేశ రాజధాని ఢిల్లీ శుక్రవారం పేలుళ్లతో దద్దరిల్లింది. నగరంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 3 కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా దళాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలోని ఫుట్‌పాత్ వద్ద పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది.

పేలుడికి ఐఈడీ ఉపయోగించినట్లుగా పోలీసులు నిర్థారించారు. రిపబ్లిక్ డే వేడుకల ముగింపు నేపథ్యంలో బీటింగ్ రీట్రీట్ జరుగుతున్న సమయంలోనే పేలుడు సంభవించడంతో అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి.

పేలుడు జరిగిన కొద్ది దూరంలోనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోడీలు రిపబ్లిక్ డే ఉత్సవాల్లో భాగంగా జరిగిన బీటింగ్ రీట్రీట్‌‌కు హాజరయ్యారు. పేలుడుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!