ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే కొట్టుకున్న మహిళలు.. ఎక్కడంటే..

By SumaBala BukkaFirst Published May 29, 2023, 4:03 PM IST
Highlights

ఇద్దరు మహిళల్లో ఒకరు మరో మహిళపై ఫిర్యాదు చేసేందుకు మే 14న  పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఆ తరువాత మరో మహిళ కూడా రావడంతో గొడవ మొదలయ్యింది. 

ముంబై : నవీ ముంబైలోని పోలీస్ స్టేషన్‌లో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు ఏకంగా పోలీస్ స్టేషన్లో.. పోలీసుల ముందే జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. గొడవకు దిగిన ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

మే 26న పన్వేల్ పట్టణానికి చెందిన ఓ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 160 (ఎఫైర్‌కు పాల్పడడం) కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

నిందితుల్లో ఒక మహిళ మే 14న మరో మహిళపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఈ విషయం తెలిసిన మరో మహిళ కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. మొదటి మహిళతో వాగ్వాదానికి దిగిందని తెలిపారు. ఇద్దరూ ఆ పోలీస్ స్టేషన్లోనే ఒకరినొకరు దూషించుకున్నారు.

దారుణం.. ప్రియురాలిని కత్తులతో పొడిచి, బండరాయితో మోది హత్య.. సీసీటీవీలో హత్యోదంతం..

ఆ తరువాత కొట్టుకున్నారు, తరువాత వారు శాంతించారు, ఇదంతా చూస్తున్న పోలీసులు వారిని ఆపారు. వారిమీద కేసు నమోదు చేశారు. కానీ, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారి తెలిపారు.

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని థానే జిల్లాలో భార్య గర్భం దాల్చడం లేదని అతి దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. ఈ విషయం మీద తరచూ గొడవలు పడే ఓ వ్యక్తి తన 35 ఏళ్ల భార్యను హత్య చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

అంబర్‌నాథ్ ప్రాంతంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాలనీలో ఈ దంపతుల నివాసం ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగడంతో 37 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఉల్హాస్‌నగర్ కంట్రోల్ రూమ్ అధికారి తెలిపారు.ఆ వ్యక్తి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

మహిళ గర్భం దాల్చకపోవడంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుండేవారని అధికారి తెలిపారు. ఆదివారం మళ్లీ వారిద్దరి మధ్య గొడవ జరగడంతో నిందితుడు భార్యపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో మహిళ కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

విషయం తెలియడంతో ఫ్యాక్టరీలోని వర్కర్స్ యూనియన్ ప్రతినిధి పోలీసులను అప్రమత్తం చేశారు, వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపినట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్ జెబి సోనావానే పిటిఐకి తెలిపారు. ఆ వ్యక్తిని ఆదివారం రాత్రి అరెస్టు చేసి అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

click me!