తొమ్మిదో తరగతి విద్యార్థికి అరగంటలో రెండు టీకాలు.. ఎలా అయిందంటే...

Published : Jan 20, 2022, 12:15 PM IST
తొమ్మిదో తరగతి విద్యార్థికి అరగంటలో రెండు టీకాలు.. ఎలా అయిందంటే...

సారాంశం

పాఠశాల గేటు వద్ద తిరుగుతున్న విద్యార్థిని వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడుతున్నాడనుకున్న పాఠశాల సిబ్బంది ధైర్యం చెప్పి, లోపలికి తీసుకెళ్లారు. vaccination వేయడం పూర్తయ్యాక తాను మొదటి టీకా కూడా వేయించుకున్నట్లు మెల్లగా చెప్పాడు. దీంతో పాఠశాల సిబ్బంది ఖంగుతిన్నారు. 

పశ్చిమ బెంగాల్ :  తొమ్మిదో తరగతి విద్యార్థి అరగంట వ్యవధిలో రెండు covid vaccination doses వేయించుకున్న ఘటన West Bengalలోని ఖరగ్ పుర్ సబ్ డివిజన్ లో జరిగింది. దేబ్రాలోని అలోకా పాఠశాలలో చదువుతున్న సాథీదే అనే విద్యార్థి సోమవారం మొదటి టీకా వేయించుకున్నాడు. 

ఆ తరువాత ఇంటికి వెళ్లకుండా school గేటు వద్ద తిరుగుతూ కనిపించాడు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడుతున్నాడనుకున్న పాఠశాల సిబ్బంది ధైర్యం చెప్పి, లోపలికి తీసుకెళ్లారు. vaccination వేయడం పూర్తయ్యాక తాను మొదటి టీకా కూడా వేయించుకున్నట్లు మెల్లగా చెప్పాడు. దీంతో పాఠశాల సిబ్బంది ఖంగుతిన్నారు. 

అది ముందే చెప్పాల్సింది కదా.. ఇలా ఎందుకు చేశావని పిల్లాడిని ప్రశ్నించగా.. ఒకేరోజు రెండు టీకాలు వేస్తారనుకున్నానని అమాయకంగా బదులిచ్చాడు. దీంతో ఆందోళన చెందిన వైద్యులు, ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం సాధారణంగానే ఉందని నిర్థారించుకున్న తరువాత ఇంటికి పంపించారు. 

ఇదిలా ఉండగా, కొన్ని షరతులకు లోబడి covishield, covaxin టీకాలను regular marketలోకి అనుతించేందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్ సీఓ)కు చెందిన నిపుణుల కమిటీ బుధవారం సిఫార్సు చేసింది. మన దేశంలో అభివృద్ధి పరిచిన ఈ రెండు covid vaccineలకు ఇప్పటివరకు అత్యవసర వినియోగ అనుమతి మాత్రమే ఉంది. తమ టీకాలను బహిరంగ మార్కెట్లో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు అనుమతించాల్సిందిగా కొవిషీల్డ్ తయారీదారైన CII, కొవాగ్జిన్ ను అభివృద్ధి పరిచిన Bharat Biotech సంస్థలు విడివిడిగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( DCGI)కు దరఖాస్తు చేసుకున్నాయి. 

ఈ రెండు సంస్థల నుంచి అందిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన అనంతరం సీడీఎస్ సీఓకు చెందిన నిపుణుల కమిటీ బుధవారం సమావేశమై కొన్ని షరతులకు లోబడి రెండు టీకాలకు బహిరంగ విపణి అనుమతులను జారీ చేయవచ్చని నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తుది ఆమోదం కోసం ఈ సిఫార్పులను డీసీజీఐకి పంపించనున్నారు. 

ఇదిలా ఉండగా, దేశంలో coronavirus విజృంభ‌ణ కొన‌సాగుతోంది. దీంతో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. రోజువారీ కేసులు ఏకంగా మూడు ల‌క్ష‌ల మార్కును దాటిన‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు అందిన తాజాగా డేటా గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు అందిన క‌రోనా రోజువారీ స‌మాచారం ప్ర‌కారం.. జనవరి 19న దేశంలో 3,13,603 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. ఇది వారం క్రితంతో పోలిస్తే 27% పెరిగింది. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 3.8 కోట్ల‌కు పెరిగింది. active caseల సంఖ్య 18.9 లక్షల మార్కును దాటింది. అయితే, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, లడఖ్, లక్షద్వీప్, త్రిపురలకు సంబంధించిన తాజా డేటా ఇంకా రావాల్సి ఉంది. ఈ డేటా అంచ‌నాలు క‌లుపుకుంటే రోజువారీ క‌రోనా కేసులు ఈ ఏడాదిలో కొత్త రికార్డులు నెల‌కోల్ప‌నున్నాయి. జనవరి 19న మహారాష్ట్రలో 43,697 క‌రోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, క‌ర్నాట‌క‌లో 40,499, కేరళలో  34,199 కేసులు వెగులుచూశాయి. అలాగే, 475 మ‌ర‌ణాలు సైతం న‌మోద‌య్యాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi in Bodo Cultural Programme: బోడో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధాని మోదీ| Asianet News Telugu
Liquor sales: మందుబాబుల‌కు షాకింగ్ న్యూస్‌.. 28 రోజుల పాటు వైన్స్ షాపులు బంద్‌. కార‌ణం ఏంటంటే.?