మహిళ కడుపులో దూదిపెట్టి కుట్టేసిన డాక్టర్లు.. ఇంత నిర్లక్ష్యమా? మండిపడ్డ కోర్టు.. క్రిమినల్ కేసు నమోదు...

By SumaBala BukkaFirst Published Jan 20, 2022, 9:29 AM IST
Highlights

డెలివరీ అయిన వెంటనే, తన భార్యకు కడుపు నొప్పి, కడుపులో ఎర్రటి గుర్తులతో వాపు మొదలైందని, ఆ తర్వాత అతను ఆమెను మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లాడని, అక్కడ వైద్యులు ఆమెకు నొప్పిని తగ్గించడానికి కొన్ని విటమిన్ టాబ్లెట్లు, ఇతర మందులు ఇచ్చారని రాయ్ ఆరోపించారు. కానీ శివ హాస్పిటల్ వైద్యులు ఇచ్చిన మందులు పని చేయకపోవడంతో, రాయ్ ఆమెను మరొక ఆసుపత్రికి తీసుకెళ్లాడు, అక్కడ వైద్యులు ఆమె కడుపులో ఏదో ఉందని అనుమానించి, వేరే ట్రీట్మెంట్ ప్రారంభించారు.

గురుగ్రామ్ : Childbirth సమయంలో cesarean operation చేసి ఆమె కడుపులో Cotton woolని మర్చిపోయి కుట్లు వేసిన.. వైద్యపరమైన నిర్లక్ష్యం ఆరోపణలపై FIR నమోదు చేయాలని గుర్గాన్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సెక్టార్ 12లోని Shiva Hospital‌పై 
Criminalకేసు నమోదు చేయాలంటూ గతంలో చేసిన అభ్యర్థనలను పోలీసులు తిరస్కరించారు. దీంతో ఆ మహిళ భర్త ఫిర్యాదుపై గుర్గోవాన్ Chief Metropolitan Magistrate Courtమంగళవారం ఈ ఉత్తర్వులు ఇచ్చింది.

డార్జిలింగ్‌కు చెందిన స్వస్తిక అనే మహిళ తన భర్త దివాస్ రాయ్ తో కలిసి ఇక్కడ సికందర్‌పూర్‌లో నివసిస్తున్నారు. 2020ఏప్రిల్లో తన భార్య గర్భవతిగా ఉందని, ప్రసవం సమయంలో ఈ దారుణం జరిగిందని దివాస్ రాయ్ కోర్టుకు చేసిన ఫిర్యాదులో తెలిపారు.

"కోవిడ్ కారణంగా లాక్డౌన్ ఉంది. నేను నా ఉద్యోగాన్ని కోల్పోయాను. అలాంటి పరిస్థితిలో నా వద్ద డబ్బులు లేకపోవడంతో భార్యను ప్రభుత్వ అంగన్‌వాడీ కేంద్రానికి తీసుకెళ్లాను. అంగన్‌వాడీ కార్యకర్త నా భార్యను సెక్టార్-12లోని శివ ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరాడు' అని కోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

"నేను నా భార్యను శివా హాస్పిటల్‌కి తీసుకెళ్లగా, వైద్యులు ఆమెకు నవంబర్ 16, 2020న ఆపరేషన్ చేశారు. ఆడపిల్ల జన్మించింది. దీనికి గానూ ఆసుపత్రి సిబ్బంది రూ. 30,000 వసూలు చేసింది" అని అతను చెప్పాడు.

డెలివరీ అయిన వెంటనే, తన భార్యకు కడుపు నొప్పి, కడుపులో ఎర్రటి గుర్తులతో వాపు మొదలైందని, ఆ తర్వాత అతను ఆమెను మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లాడని, అక్కడ వైద్యులు ఆమెకు నొప్పిని తగ్గించడానికి కొన్ని విటమిన్ టాబ్లెట్లు, ఇతర మందులు ఇచ్చారని రాయ్ ఆరోపించారు. కానీ శివ హాస్పిటల్ వైద్యులు ఇచ్చిన మందులు పని చేయకపోవడంతో, రాయ్ ఆమెను మరొక ఆసుపత్రికి తీసుకెళ్లాడు, అక్కడ వైద్యులు ఆమె కడుపులో ఏదో ఉందని అనుమానించి, వేరే ట్రీట్మెంట్ ప్రారంభించారు.

“ప్రసవానంతర ప్రారంభమైన నొప్పితో బాధపడుతున్న నా భార్యకు ఏ మాత్రం తగ్గలేదు. అంతేకాదు ఆమె బరువు 16 కిలోలు తగ్గింది. దీంతో నేను ఆమెను మూడవ ఆసుపత్రికి తీసుకెళ్లాను. అక్కడ వాళ్లు నా భార్యకు CT-స్కాన్ చేయించమని సలహా ఇచ్చారు. అందులో ఆమె పొత్తికడుపులో కొన్ని దూది ఉండలలాంటివి ఉన్నాయని తేలింది”అని రాయ్ చెప్పారు.

తాను ఈ విషయాన్ని శివా హాస్పిటల్‌ వారికి చెప్పినా వారు మొదట పెద్దగా పట్టించుకోలేదు. అయితే తర్వాత నా ఇంటికి అంబులెన్స్ పంపి, నాకు తెలియకుండా, నా అనుమతి లేకుండా నా భార్యను  ఆసుపత్రిలో చేర్చారని అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

"ఆసుపత్రిలో, వారు ఆమెకు కొన్ని ఖాళీ ఫారమ్‌లపై సంతకం చేయించారు. ఆ తరువాత ఆమెకు మళ్లీ ఆపరేషన్ చేసి దూది ఉండలను తొలగించారు" అని రాయ్ చెప్పారు. ఆ తరువాత  "నేను పోలీసుల వద్దకు వెళ్లాను, వారు నా ఫిర్యాదును పట్టించుకోలేదు" అని రాయ్ తెలిపారు.

అయితే కోర్టు ఆదేశాల మేరకు, పోలీసులు గురుగ్రామ్‌లోని సెక్టార్ 14 పోలీస్ స్టేషన్‌లో శివ ఆసుపత్రికి చెందిన డాక్టర్ పూనమ్ యాదవ్, డాక్టర్ అనురాగ్ యాదవ్‌లపై భారతీయ శిక్షాస్మృతిలోని
సెక్షన్ 417 (మోసం చేసినందుకు శిక్ష), 336 (ప్రాణానికి లేదా వ్యక్తిగతానికి హాని కలిగించే చర్య),  337 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్య ద్వారా గాయపడటం)ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 
 
సెక్టార్ 14 పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఇతర IPC సెక్షన్‌లైన 338 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్య), 506 (నేరపూరిత బెదిరింపు), 509 (మహిళ  అణకువను అవమానించడం), 34 లు కూడా చేర్చబడ్డాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

click me!