టీఎంసీ ఎమ్మెల్యేలతో సహా... బీజేపీలోకి ముకుల్ రాయ్ కుమారుడు

Published : May 28, 2019, 01:59 PM IST
టీఎంసీ ఎమ్మెల్యేలతో సహా... బీజేపీలోకి ముకుల్ రాయ్ కుమారుడు

సారాంశం

బీజేపీ నేత ముకుల్ రాయ్ కుమారుడు సుభ్రాంషు రాయ్‌ మంగళవారం బీజేపీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలో చేరేందుకు ఆయన మంగళవారం దేశరాజధాని ఢిల్లీ చేరుకున్నారు. 

బీజేపీ నేత ముకుల్ రాయ్ కుమారుడు సుభ్రాంషు రాయ్‌ మంగళవారం బీజేపీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలో చేరేందుకు ఆయన మంగళవారం దేశరాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట మరో ఇద్దరు టీఎంసీ( తృణముల్ కాంగ్రెస్ పార్టీ) ఎమ్మెల్యులు కూడా ఉండటం గమనార్హం.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుభ్రాంషు రాయ్‌ ని ఇటీవల పార్టీ నుంచి మమతా బెనర్జీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.  వాస్తవానికి ముకుల్ రాయ్ ఒకప్పుడు టీసీఎంలో ఉన్నారు. కానీ మమతతో పొసగక 18 నెలల క్రితం పార్టీ నుంచి బయటకొచ్చారు. ఇప్పుడు బీజేపీలో క్రియాశీలక పాత్ర పోసిస్తున్నారు. 

ఇప్పుడు తండ్రి బాటలోనే సుభ్రాంషు రాయ్‌ కూడా.. బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. ఆయన పార్టీ నుంచి వెళుతూ వెళుతూ... మరో ఇద్దరు పార్టీ ఎమ్మెల్యేలను కూడా తీసుకువెళ్లడం విశేషం. ఈ పార్టీ మారే పరంపర ఇక్కడితో ఆగలేదని.. మరికొందరు టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ముకుల్ రాయ్ పథకం ప్రకారం.. టీఎంసీ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 
 

PREV
click me!

Recommended Stories

Rs 500 Notes : నిజంగానే ఆర్బిఐ రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేస్తుందా..? కేంద్రం క్లారిటీ
Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu