పేలిన గ్యాస్ సిలిండర్... ఎమ్మెల్యేకు గాయాలు

Published : May 28, 2019, 09:49 AM IST
పేలిన గ్యాస్ సిలిండర్... ఎమ్మెల్యేకు గాయాలు

సారాంశం

గ్యాస్ సిలిండర్ పేలి ఎమ్మెల్యే, ఆయన భార్య తీవ్రగాయాలపాలైన సంఘటన బీహార్ రాష్ట్రంలోని తారాపూర్ పట్టణంలోని ముంగర్ ప్రాంతంలో జరిగింది.

గ్యాస్ సిలిండర్ పేలి ఎమ్మెల్యే, ఆయన భార్య తీవ్రగాయాలపాలైన సంఘటన బీహార్ రాష్ట్రంలోని తారాపూర్ పట్టణంలోని ముంగర్ ప్రాంతంలో జరిగింది. తారాపూర్ ఎమ్మెల్యే మేవలాల్ చౌదరి ఇంట్లో మంగళవారం ఉదయం గ్యాస్ సిలిండరు ప్రమాదవశాత్తూ పేలింది. 

ఈ ఘటనలో మేవలాల్ చౌదరితోపాటు అతని భార్య మాజీ ఎమ్మెల్యే నీతా చౌదరి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని భాగల్ పూర్ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే దంపతుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని పట్నాలోని ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. సంక్రాంతి వేళ ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే
Rs 500 Notes : నిజంగానే ఆర్బిఐ రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేస్తుందా..? కేంద్రం క్లారిటీ