పారాగ్లైడింగ్ ప్రమాదం.. విద్యుత్ స్తంభానికి చిక్కుకున్న పారాచూట్‌.. రెండు గంటల పాటు నరకయాతన..

Published : Mar 08, 2023, 12:01 AM IST
పారాగ్లైడింగ్ ప్రమాదం.. విద్యుత్ స్తంభానికి చిక్కుకున్న పారాచూట్‌.. రెండు గంటల పాటు నరకయాతన..

సారాంశం

కేరళలో పారాగ్లైడింగ్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు స్తంభంపై ఇరుక్కుపోయారు. దాదాపు రెండు గంటల తరువాత పర్యాటకులిద్దరూ ఆస్పత్రిలో చేరారు.

పారాగ్లైడింగ్ ప్రమాదం: చాలామంది పర్యాటకులు థ్రిల్లింగ్,అడ్వెంచర్ యాత్రలు చేయాలనుంటుంది. అలాంటి వారు ఎక్కువగా ఇష్టపడేది పారాగ్లైడింగ్. ఇందులో అడ్వెంచర్ తో పాటు థ్రిల్లింగ్ కూడా ఉంటుంది. అందుకే.. ఈ పారాగ్లైడింగ్ సాహస యాత్రకు చాలామంది ఆసక్తి చూపుతారు. అయితే.. కొందరు ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేస్తుంటే.. మరికొందరు తమ విహారాన్ని విషాదంతో ముగించుకుంటున్నారు. ఈ సహస క్రీడ వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు.

తాజాగా.. వినోదం కోసం చేసిన పారాగ్లైడింగ్ లో ప్రమాదం చోటుచేసుకుంది.  కేరళలో మంగళవారం (మార్చి 7) పారాగ్లైడింగ్ సమయంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ, ఓ వ్యక్తికి సంబంధించిన పారాచూట్‌ విద్యుత్ స్తంభానికి చిక్కుకోవడంతో వారు గట్టిగా కిందపడకుండా స్తంభాన్ని పట్టుకున్నారు. ఈ ఘటన తిరువనంతపురంలోని వర్కాలలో చోటుచేసుకుంది. పర్యాటకులిద్దరినీ రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

పర్యాటకులిద్దరూ తిరువనంతపురంలోని వర్కాలలోని పాపనాశం బీచ్‌లో పారాగ్లైడింగ్ చేస్తున్నారు. పారాచూట్ ల్యాండ్ కావాల్సిన చోట దిగలేదు. కానీ ప్రమాదశాత్తు వారి పారాచూట్ ఎత్తైన విద్యుత్తు స్తంభానికి చిక్కుకుంది. విద్యుత్ స్తంభం పైన పలు హైవోల్టేజీ లైట్లు అమర్చడం, 50 అడుగులకు పైగా ఎత్తులో ఉన్న స్తంభానికి రెండు పారాగ్లైడర్లు వేలాడదీయడం వీడియోలో చూడవచ్చు. వారిద్దరిని రక్షించబడటానికి దాదాపు రెండు గంటల పాటు శ్రమించారు.

ఆ సమయంలో పర్యటకులు స్తంభానికి వేలాడుతూనే ఉన్నారు.  శాఖ వద్ద పొడవైన నిచ్చెన లేదు. దీంతో సహాయక చర్యలకు సమయం పట్టింది. ముందుజాగ్రత్త చర్యగా పిల్లర్ కింద పరుపులు, వలలు ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత 28 ఏళ్ల మహిళ, పారాగ్లైడింగ్ శిక్షకుడు సురక్షితంగా రక్షించబడ్డారని పోలీసులు తెలిపారు. వారిద్దరూ వర్కాలలోని తాలూకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, క్షేమంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు..

పారాగ్లైడింగ్ సమయంలో ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది డిసెంబర్‌లో 24 గంటల వ్యవధిలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు పారాగ్లైడింగ్‌లో మరణించారు. గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో దక్షిణ కొరియాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తూ కిందపడి మరణించాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలోని దోభి ప్రాంతంలో పారాగ్లైడింగ్ చేస్తూ మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల పర్యాటకుడు మరణించాడు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?