త్రిపురలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు..

Published : Feb 08, 2022, 01:05 PM ISTUpdated : Feb 08, 2022, 01:06 PM IST
త్రిపురలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన  ఇద్ద‌రు ఎమ్మెల్యేలు..

సారాంశం

త్రిపుర బీజీపీకి రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెల్యే నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది. బీజేపీ నుంచి వీరి వైదొలగడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 33 కు చేరుకుంది. 

త్రిపుర (tipura)లో బీజేపీ (bharathiya janatha party-bjp)కి సోమవారం రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెలేలు నేడు కాంగ్రెస్ లో చేరారు. ఈ మేర‌కు వారు మంగళవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల‌ను క‌లిశారు. దీనిని ఓ మీడియా సంస్థ ధృవీక‌రించింది. బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేల‌లో సుదీప్ రాయ్ బర్మన్ (Sudeep ray barman), ఆశిష్ కుమార్ సాహా (ashish kumar saha)లు ఉన్నారు. దీంతో త్రిపుర‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 33కు చేరుకుంది. త్రిపుర అసెంబ్లీలో 60 స్థానాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం బీజేపీ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉంది. అయితే ఇద్ద‌రు రాజీన‌మా చేయ‌డంతో ఇప్పుడు ఆ పార్టీకి మెజారిటీ కంటే రెండు స్థానాలు మాత్ర‌మే ఎక్కువ‌గా ఉన్నాయి. మ‌రికొన్ని రాజ‌కీయ వ‌ల‌స‌లు ఏర్ప‌డితే త్రిపుర‌లో బీజేపీ ప్ర‌భుత్వం కూలిపోయే ప్ర‌మాదం ఉంది. 

కాంగ్రెస్ లో చేరిన సంద‌ర్భంగా ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బ‌ర్మ‌న్ మీడియాతో మాట్లాడారు. “ చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు, అయితే టెక్నిక‌ల్ (technical) కార‌ణాల వ‌ల్ల వారు మరికొన్ని నెలలు అందులోనే వేచి ఉండాలనుకుంటున్నారు. అందరూ పార్టీపై విరక్తి చెందారు. గుజరాత్ (gujarath), హిమాచల్‌ (himachal pradhesh)తో పాటు త్రిపుర (tripura)కూడా ఎన్నికలకు వెళ్లవచ్చని నేను భావిస్తున్నాను ’’ అని ఆయ‌న చెప్పారు. 

ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేర‌డంతో కొన్ని నెలలుగా సాగుతున్న ఊహాగానాలకు ముగింపు ప‌లిక‌న‌ట్టు అయ్యింది. వీర‌ద్ద‌రూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇందులో బ‌ర్మ‌న్ 15 నెలల పాటు త్రిపుర ఆరోగ్య మంత్రిగా కూడా ప‌ని చేశారు. త‌ర్వాత మంత్రి మండ‌లి నుంచి బ‌హిష్క‌ర‌ణకు గుర‌య్యారు. అప్ప‌టి నుంచి బీజేపీలోని అసమ్మతి శిబిరానికి ఆయ‌న నాయకత్వం వహిస్తున్నారు. 2019 లోక్‌సభ (lokh sabha) ఎన్నికల సందర్భంగా ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డార‌ని ఆరోప‌ణ ఉంది. 

అస‌మ్మ‌తిని త‌గ్గించేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు..
పార్టీలో అంత‌ర్గ‌త అస‌మ్మ‌తిని త‌గ్గించ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నాలు చేసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు రామ్ ప్రసాద్ పాల్ (ram prasad paul), సుశాంత చౌదరి (sushantha choudary)లను గ‌తేడాది ఆగస్టు 31న మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్నారు. అలాగే సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ (biplav kumar dheb)ఒక ఒక ఎస్సీ కమ్యూనిటీ (sc community)కి చెందిన ఎమ్మెల్యే ను మంత్రిని చేశారు. దీంతో పాటు రెబాటి మోహన్ దాస్ (rebati mohan dhas)స్థానంలో రతన్ చక్రవర్తి (rathan chakravarthi)ని అసెంబ్లీ స్పీకర్‌గా నియమించారు. అయితే బ‌ర్మ‌న్ కు మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని హైక‌మాండ్ అత‌నిని సంప్ర‌దించింది. కానీ ఆయ‌న సీఎంను మార్చాల‌ని ప‌ట్టుబ‌ట్టార‌ని బీజేపీ వ‌ర్గాలు తెలిపాయి. అశిష్ కుమార్ స‌హాకు కూడా మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేసిన‌ప్ప‌టికీ ఆయ‌న దానిని తిర‌స్క‌రించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !