2008 Ahmedabad serial blasts case: అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు తుదితీర్పు.. 49 మంది దోషులు..

Published : Feb 08, 2022, 12:54 PM IST
2008 Ahmedabad serial blasts case: అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు తుదితీర్పు.. 49 మంది దోషులు..

సారాంశం

2008 Ahmedabad serial blasts case: 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్లకు సంబంధించిన కేసులో న్యాయ‌స్థానం మంగ‌ళ‌వారం నాడు తుదితీర్పు వెల్ల‌డించింది. ఈ కేసులో 49 మంది దోషులుగా తేలారు. సరైన సాక్యాధారాలు లేకపోవడంతో మరో 28 మంది నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది.  

2008 Ahmedabad serial blasts case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్లకు సంబంధించిన కేసులో 49 మందిని దోషులుగా పేర్కొంటూ మంగళవారం నాడు ప్రత్యేక కోర్టు తన తీర్పును వెలువరించింది. అహ్మదాబాద్‌ వరుస బాంబు పేలుళ్ల కేసు  49 మంది దోషులుగా తేలగా, స‌రైన‌ సాక్యాధారాలు లేకపోవడంతో మరో 28 మంది నిర్దోషులుగా  న్యాయస్థానం ప్రకటించింది. మొత్తం 77 మంది నిందితులను విచారించిన గుజరాత్ స్పెషల్‌ కోర్టు  ఈ తీర్పును వెలువ‌రించింది. 

గోద్రా అల్ల‌ర్లకు ప్రతీకారంగానే.. ! 

2002 ఫిబ్రవరిలో గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌‌ప్రెస్‌కు చెందిన రెండు బోగీలకు అల్లరి మూకలు నిప్పు పెట్టారు. ఈ దుర్ఘ‌ట‌న‌లో 59 మంది సజీవ దహనం అయ్యారు. అనంతరం చెలరేగిన అల్లర్లలో వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 2002 గోద్రా అల్లర్లకు ప్రతికారంగానే ఉగ్రవాదులు 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల (serial blasts)కు  పాల్ప‌డ్డార‌ని ద‌ర్య‌ప్తు వ‌ర్గాలు పేర్కొన్నాయి. నిషేధిత స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమీ)కి చెందిన ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం)తో సంబంధమున్న వ్యక్తులే ఈ పేలుళ్లకు పాల్పడ్డారని నిఘా సంస్థలు తేల్చాయి. 

అహ్మదాబాద్ లో గంట వ్య‌వ‌ధిలోనే 21 చోట్ల వ‌రుస బాంబు పేలుళ్లు.. 

 2008లో ఉగ్ర‌వాదులు వ‌రుస  బాంబు పేలుళ్ల‌కు పాల్ప‌డ్డారు. 2018 జూలై 26న గంట వ్యవధిలోనే అహ్మదాబాద్‌ నగరంలో సుమారు 21 చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో సుమారు 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. నిషేధిత స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమీ)కి చెందిన ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం)తో సంబంధమున్న మూక‌లే ఈ బాంబు దాడుల‌కు పాల్ప‌డ్డాయ‌ని ద‌ర్యాప్తు వ‌ర్గాలు తేల్చాయి. 

సుదీర్ఘంగా కొన‌సాగిన విచార‌ణ.. 

2008 జూలై 26న గంట వ్యవధిలోనే అహ్మదాబాద్‌ నగరంలో సుమారు 21 చోట్ల వరుస బాంబు పేలుళ్లు (serial blasts) సంభవించాయి. ఈ పేలుళ్లలో సుమారు 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీటిపై న‌మోదైన కేసుల‌కు సంబంధించి గుజరాత్ (Gujarat) పోలీసులు మొత్తం 85 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ద‌ర్యాప్తులో ముందుకు సాగుతూ.. 78 మందిపై విచారణ కొనసాగించారు. 78 మంది నిందితుల్లో ఒకరు అప్రూవర్‌గా మార‌డ‌తో పేలుళ్ల వేనుకు ఉన్న‌వారి గురించి వెలుగులోకి వచ్చింది. ఈ క్ర‌మంలోనే నిందితులపై హత్య, నేరపూరిత కుట్ర, చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) ఆధారంగా కేసులు నమోదు చేశారు. ఇక డిసెంబర్‌ 2009లో ప్రారంభమైన ఈ కేసు విచారణ సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. దాదాపు 13 సంవ‌త్స‌రాలు విచార‌ణ సాగించారు.

తీర్పు వాయిదాలు ప‌డుతూ.. ! 

గతేడాది సెప్టెంబర్‌లో ఈ కేసు విచారణ ముగిసింది. గుజరాత్‌ (Gujarat)లో అత్యంత సంచలనం సృష్టించిన వరుస పేలుళ్ల కేసులో ప్రత్యేక న్యాయమూర్తి ఏఆర్ పటేల్ తీర్పును వెలువరించారు. అంతకుముందు, ఈ కేసు తీర్పును ప్రకటించడానికి చాలాసార్లు నోటీసు ఇవ్వబడింది, కానీ వాయిదా పడింది. ఈ పేలుళ్ల‌కు సంబంధించి మొత్తం 35 కేసులు న‌మోదుకాగా, వీటిని ఒక కేసుగా ఏకీకృతం చేసిన తర్వాత విచారణ ప్రారంభమైంది. పేలుళ్లు జరిగిన అహ్మదాబాద్‌లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి. గుజరాత్‌ (Gujarat) స్పెషల్‌ కోర్ట్‌1,100 మందికి పైగా సాక్షులను విచారించింది.

PREV
click me!

Recommended Stories

Gallantry Award : సాధారణ తెలుగు కానిస్టేబుల్ కి శౌర్య పతకం.. ఎవరీ మర్రి వెంకట్ రెడ్డి..? ఏ సాహసం చేశాడు..?
India Gate Ahead of Republic Day 2026: త్రివర్ణ దీపాల కాంతులతో ఇండియా గేట్ | Asianet Telugu